USCIS కొత్త విధానం : యూఎస్‌లో గ్రీన్‌కార్డ్ కోసం ఏళ్ల తరబడి లక్షలాది మంది వలసదారులకు అమెరికా ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) తాజాగా విడుదల చేసిన కొత్త పాలసీ మెమో ప్రకారం.. ఇకపై అమెరికాలో ఉండగానే ‘అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్’ ద్వారా గ్రీన్‌కార్డ్ పొందడం అత్యంత కఠినంగా మారనుంది. సాధారణంగా గ్రీన్‌కార్డ్ కోరుకునే వారు ఇకపై తమ స్వదేశానికి, అక్కడ ఉండే అమెరికా కాన్సులెట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
చట్టం అసలు ఉద్దేశ్యాన్ని మళ్లీ అమల్లోకి తెస్తున్నాం: USCIS
USCIS ప్రతినిధి జాహ్లర్ కీలక వ్యాఖ్యలు చేశారు. “అమెరికా ఇమ్మిగ్రేషన్ చట్టం యొక్క అసలు ఉద్దేశ్యాన్ని మేము మళ్లీ అమలు చేస్తున్నాం. తాత్కాలిక వీసాలపై (ఎఫ్1, హెచ్‌హెచ్1బీ, బీ1 /బీ2) అమెరికాకు వచ్చే విద్యార్థులు, ఉద్యోగులు లేదా పర్యాటకులు తమ వీసాలు పూర్తయిన తర్వాత తిరిగి స్వదేశానికి వెళ్లాలి. అని USCIS ప్రతినిధి జాక్ కాహ్లర్ స్పష్టం చేశారు.
కొత్త నిబంధనలు వల్ల మారే అంశాలు ఇవే
ఇప్పటివరకు అమెరికాలో లీగల్ స్టేటస్‌లో ఉంటూనే గ్రీన్కార్డ్కు (ఐ-485) స్టేటస్ మార్చుకునే అవకాశం చాలా మందికి ఉండేది. కానీ తాజా మార్గదర్శకాలతో ఆ USCIS అనుమతించబడింది. ఇకపై అత్యంత “అసాధారణ పరిస్థితులు” ఉన్నవారికి మాత్రమే అమెరికా లోపల స్టేటస్ అడ్జస్ట్‌మెంట్‌కు అనుమతి లభిస్తుంది. ప్రతి దరఖాస్తును అధికారులు వ్యక్తిగతంగా, అత్యంత కఠినంగా పరిశీలించి మాత్రమే నిర్ణయం తీసుకుంటారు. నిబంధనలు వర్తించని వారు ఖచ్చితంగా భారత్ లేదా వారి స్వదేశాలకు ‘కాన్సులర్ ప్రాసెసింగ్’ ద్వారా గ్రీన్కార్డ్కు వెళ్లి తెచ్చుకోవాలి.
అమెరికాలో వీసా గడువు ముగిసిన తర్వాత కూడా అక్రమంగా మిగిలిపోయే వారి సంఖ్యను తగ్గించడం… USCIS బ్యాక్‌లాగ్‌లను తగ్గించడం, సంస్థ వనరులను ఇతర ప్రాధాన్య కేసులను ఉపయోగించడం… బాధితులు, మానవ అక్రమ రవాణా బాధితుల వీసాలు, పౌరసత్వ దరఖాస్తులను వేగంగా పరిష్కరించడం లక్ష్యంగా ఈ కొత్త నిబంధనలు ప్రకటనలో వచ్చాయి.
భారతీయ ఐటీ ఉద్యోగులు, విద్యార్థులపై తీవ్ర ప్రభావం!
ఈ నిర్ణయం ముఖ్యంగా భారతీయులపై కోలుకోలేని దెబ్బ తీసే అవకాశం ఉందని ఇమ్మిగ్రేషన్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే దశాబ్దాలుగా గ్రీన్ లక్షలాది మంది భారతీయ టెకీలు (హెచ్-1బీ హోల్డర్స్), ఉన్నత చదువుల కోసం వెళ్లిన విద్యార్థులు ఈ కొత్త మార్పుతో తీవ్ర ఆందోళనలో పడ్డారు. గ్రీన్‌కార్డ్ ప్రక్రియ కోసం అమెరికా వదిలి స్వదేశానికి వెళ్తే మళ్లీ అక్కడ వీసా రిజెక్ట్ అవుతుందేమోనన్న భయాందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి.
కోర్టు మెట్లు ఎక్కనున్న కొత్త పాలసీ?
మరోవైపు USCIS తీసుకున్న ఈ హఠాత్ నిర్ణయంపై న్యాయపరమైన సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. వలసదారుల హక్కుల సంఘాలు కోర్టులను ఆశ్రయించడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. దీంతో ట్రంప్ కఠిన నిర్ణయాల వల్ల అమెరికాలో భారతీయులు సహా విదేశీయులు ముందుగా స్వేచ్ఛగా ఉండటం.. పనిచేసుకోవడం చాలా కష్టంగా మారనుంది..

