అయోధ్య రామాలయం నిధుల చోరీ కేసులో సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారీ. ఈ కేసులో అసలు నేరస్థులను అటు ప్రభుత్వం, ఇటు అధికారులు కాపాడారు. ఈ విషయంపై సుప్రీం కోర్టులో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
పవిత్ర రామాలయాన్ని దోచుకున్న కేసులో అరెస్ట్ అయిన 8మంది చిన్న చేపలు మాత్రమే.. తిమింగలాలు వేరే ఉన్నాయి. అసలైన దోషులను బీజేపీ ప్రభుత్వం, అధికార యంత్రాంగం కాపాడుతున్నాయని అన్నారు. సుప్రీంకోర్టు విచారణలో జరగాలని డిమాండ్ చేశారు.
బీజేపీ, వీహెచ్ పీలు సామాన్య హిందూ భక్తులను ఎలా మోసం చేస్తున్నారో మొదటి నుంచి చూస్తూ వస్తున్నారు. 1980లో రామజన్మభూమి ఉద్యమంలో సామాన్య హిందూ భక్తులను వీహెచ్ పీ, బీజేపీలు ఎలా మోసం చేశారో చూశాను. 2024లో ఆలయ ప్రారంభోత్సవం జరిగినప్పుడు అదే స్థాయిలో మోసం జరిగింది. వేద గ్రంథాలకు, హిందూ శాస్త్రాలకు విరుద్ధంగా ఆలయం ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. దీనికి శంకరాచార్యులు ఆ తర్వాత బహిష్కరించారని అన్నారు. ఇప్పుడు విశ్వాసం పేరుతో సామాన్య ప్రజలను ఎలా మోసం చేస్తున్నారో వాస్తవం ప్రజల్లోకి వస్తోంది’’ అని కాంగ్రెస్ ఎంపీ తివారీ అన్నారు.
అయోధ్యారామాలయం లక్షలాది మంది భారతీయుల విశ్వాసం, భక్తి, సాంస్కృతిక చైతన్యానికి ప్రతీకగా నిలుస్తోంది.

