న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ అరుదైన రికార్డు సాధించాడు. ఈ మ్యాచ్‌లో రెండో రోజు మిచెల్ శాంట్నర్‌ను ఔట్ చేయడంతో తన 250వ వికెట్‌ను పూర్తి చేశాడు. వీటిల్లో 7000+ పరుగులు, 250+ వికెట్లు తీసిన రండో క్రికెట్‌గా చరిత్రకెక్కాడు. ఈ అరుదైన ఫీట్‌ని గతంలో సౌతాఫ్రికా క్రికెట్ దిగ్గజం జాక్వెస్ కల్లిస్ మాత్రమే సాధించారు. ఆయన 1995-2013 మధ్య 166 పరుగుల ఆడి 13289 పరుగులు చేసి, 292 వికెట్లు తీశారు.
ఇప్పుడు స్టోక్స్ ఆ ఘనత సాధించి శభాష్ అనిపించుకున్నాడు. దీనితో పాటు మరో ఘనత కూడా అతడు సాధించాడు. ఆటగాళ్లలో 7000+ పరుగులు, 250+ వికెట్లు తీసిన తొలి ఇంగ్లండ్ క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. 250 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన తొమ్మిదో బౌలర్‌గా నిలిచాడు.

