భర్త గురక విడాకుల కేసు: ఆమె విసిగిపోయింది. తట్టుకోలేకపోయింది. ఏళ్లుగా అదే బాధ. అతడికి చెప్పి చూసింది. అతడి వ్యవహార శైలి మారలేదు. పైగా మరింత దారుణంగా అతడు ప్రవర్తించ సాగాడు.. శారీరకంగా ఇబ్బంది పెట్టకపోయినప్పటికీ.. ఆమె కంటిమీద కునుకు లేకుండా చేశాడు. దీంతో ఆమెకు ఏం చేయాలో తెలియలేదు. ఎలా ఉండాలో అర్థం కాలేదు. చివరికి ఒక నిర్ణయం తీసుకుంది.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ నగరంలో ఓ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి చాలా సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. అయితే వైవాహిక జీవితంలో ఎటువంటి ఇబ్బందులు లేవు. పైగా వారిద్దరు అన్యోన్యంగానే ఉంటారు. పడక పైకి వెళ్తే చాలు అతనిలో ఉన్న అపరిచితుడు బయటికి వస్తాడు. గట్టిగా శబ్దం చేస్తుంది. ఆ శబ్దం ఆమె తట్టుకోదు. ఆమెకు కనీసం నిద్ర కూడా లేదు. ఆ శబ్దం తీవ్రతకు కొన్ని సందర్భాల్లో ఆమె రాత్రంతా మెలకువతోనే ఉండాల్సి వస్తోంది. భర్తకు చెప్పి చూసినప్పటికీ అతని ప్రవర్తన మారలేదు. దీంతో ఆమె విడాకులు కోరుకుంది.
భర్త నుంచి వస్తున్న ఆ శబ్దం పేరు గురక.. అతడు అదే పనిగా గురక పెడుతున్నప్పుడు ఆమెకు నిద్ర ఉండటం లేదు. దీంతో ఆ గురకను భరించలేక ఆమె విడాకులకు దరఖాస్తు చేసింది. కౌన్సిలర్లను ఆశ్రయ ఫ్యామిలీ చేసింది. తనకు నిద్ర పట్టడం లేదని భర్త తన తీరు మార్చుకోవడం లేదని.. అతడితో కేవలం సమస్యగా ఉందని.. మిగతా ఇబ్బందులు ఏమీ లేవని చెప్పింది. దీంతో ఫ్యామిలీ కౌన్సిలర్లు వారిద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చారు. మూడు నెలలు విడిగా ఉండాలని సూచించారు. ఆ మూడు నెలల్లో ఆమెకు భర్త విలువ తెలిసి వచ్చింది. దీంతో ఆమె విడాకుల నిర్ణయాన్ని మార్చుకుంది.
గురక వల్ల ఆ మహిళ చాలా రోజులపాటు నిద్రను కోల్పోయింది. పైగా భర్త నుంచి విపరీతంగా గురక రావడంతో ఆమె తట్టుకోలేకపోయింది. అందుకే విడాకులకు దరఖాస్తు చేసుకుంది. కాకపోతే కౌన్సిలింగ్లో తన నిర్ణయాన్ని మార్చుకుంది.. అయితే ఇప్పుడు అభర్త తన గురక సమస్య నివారణకు చికిత్స తీసుకున్నాడా? లేదా? అనే వివరాలు తెలియలేదు. కాకపోతే కేవలం గురుకను సమస్యగా చూపించి విడాకుల కోసం ఒక భార్య దరఖాస్తు చేసుకోవడం దేశంలోనే తొలిసారి అని అక్కడి ఫ్యామిలీ కౌన్సిలర్లు చర్చించుకోవడం ఇక్కడ విశేషం.

