- ఇరాన్ సుప్రీం లీడర్ అంత్యక్రియలకు మోడీకి ఆహ్వానం..
- అంత్యక్రియలకు ఆహ్వానం పంపిన ఇరాన్ ప్రెసిడెంట్..
ప్రధాని మోదీకి ఇరాన్ ఆహ్వానం: ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు హాజరుకావాలని ప్రధాని నరేంద్ర మోదీకి ఇరాన్ ఆహ్వానం పలికింది. ఇరాన్ ప్రెసిడెంట్ మసౌద్ పెజెష్కియాన్ ఈ మేరకు ఆహ్వానించినట్లు సమాచారం. ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయిల్ దాడుల్లో ఖమేనీ మరణించారు. ఆయన అంత్యక్రియలు జూలై 4న ప్రారంభమై, ఇరాన్ పవిత్ర నగరంగా ఉన్న మషాద్‌లో జూలై 9న ఆయనను ఖననం చేయడంతో ముగుస్తాయి. ఖమేనీ స్వస్థలం కూడా మషాద్ నగరమే.
86 ఏళ్ల ఖమేనీ ఇరాన్ యుద్ధం ప్రారంభమైన మొదటిరోజే మరణించారు. ఆయన 36 ఏళ్లుగా ఇరాన్ సుప్రీం లీడర్‌గా ఉన్నారు. మాజీ సుప్రీంలీడర్ అంత్యక్రియల ఏర్పాట్లలో భాగంగా టెహ్రాన్ దక్షిణాన ఉన్న మరో పవిత్ర నగరం ఖోమ్‌లో జూలై 7న జరుగనున్న ప్రభుత్వ మీడియా నివేదించింది. ఇస్లామిక్ చట్టాల ప్రకారం, మరణించిన వారిని త్వరగా ఖననం చేయవలసి ఉన్నా, యుద్ధం కారణంగా ఇన్నాళ్లు ఆయన మృతదేహాన్ని ఇరాన్ ప్రభుత్వం భద్రపరిచింది.

