మే 28న బక్రీద్ జరిగింది. దేశంలో ముస్లింలు ప్రార్థనలు చేశారు. పెద్ద ఎత్తున జంతు బలులు జరిగాయి. ఈ నేపథ్యంలో హిందీ టీవీ సీరియల్స్ నటి సారా ఖాన్ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. బక్రీద్‌కు జంతువులను బలి ఇవ్వడం కంటే మానవత్వం, దయ, సేవా కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని సారా ఖాన్ పేర్కొన్నారు. అల్లాకు కావాల్సింది రక్తం కాదన్నారు. ఇన్ స్టా పోస్టులో ఇంకా ఆవిడ ఏమన్నారంటే?
అల్లాకు రక్తం అవసరం లేదు!
బక్రీద్ 2026లో సారా ఖాన్ పాఠక్ పోస్ట్: బక్రీద్ పండుగకు ఆధ్యాత్మిక విలువలపై దృష్టి పెట్టాలని సారా ఖాన్ పిలుపు ఇచ్చారు. ఈద్‌ను కేవలం ఆచారాలకు లేదా జంతువులను బలి ఇచ్చేందుకు పరిమితం చేయకూడదని ఆమె చెప్పింది. “అల్లాకు మాంసం, రక్తం అవసరం లేదు. ఆయన మనలోని తఖ్వా (దైవ భీతి), కరుణ, విధేయతను మాత్రమే చూస్తారు. మూగ జంతువులను బలి ఇచ్చే బదులు ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించండి. నిస్సహాయులను ఆదుకోండి. అలాగే, మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోండి” అని సారా ఖాన్ పోస్ట్ చేసారు.
కూడా చదవండి: కట్టాలన్ రివ్యూ తెలుగు – ‘కాటాలన్’ రివ్యూ: పుష్ప లాంటి కథ… ఏనుగు దంతాల స్మగ్లింగ్… మలయాళీ యాక్షన్ ఫిల్మ్ హిట్టా? ఫట్టా?
ఖుర్బానీ అంటే కేవలం జంతు బలి కాదని, మనలోని అహంకారాన్ని బలి ఇచ్చి పవిత్రమైన హృదయాన్ని పొందడమే అల్లాకు ఇచ్చే అసలైన బహుమతి అని సారా ఖాన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సామాజిక సేవ చేయడం, పేదలకు దానం చేయడమే పండుగ అసలైన పరమార్థమని స్పష్టం చేశారామె. బక్రీద్ అంటే వేడుక చేయడం, ఆహారం, ఆచారాలు మాత్రమే కాదని… అల్లాపై సంపూర్ణ విశ్వాసం చూపించే సందర్భమని సారా ఖాన్ పేర్కొన్నారు.
కూడా చదవండి: Blast Zone Review Telugu – ‘బ్లాస్ట్ జోన్’ రివ్యూ: యాక్షన్ కింగ్ అర్జున్ లేటెస్ట్ థ్రిల్లర్ – సినిమా ఎలా ఉందంటే?
సారా ఖాన్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది. సాంప్రదాయ బక్రీద్ ఆచారాలపై ఆ విధంగా కామెంట్ చేయడం తప్పు అని కొందరు కామెంట్ చేస్తున్నారు. మరికొందరు ఆమె మాటల్లో మానవత్వాన్ని చూడాలని అంటున్నారు. బక్రీద్ పండక్కి ఇచ్చే జంతు బలిని ప్రశ్నించడంపై మరికొందరు అసహనం వ్యక్తం చేశారు. హిందీ సీరియల్ ‘సప్నా బాబుల్ కా… బిదాయి’, రియాలిటీ షో ‘బిగ్ బాస్ 4’తో సారా ఖాన్ పాపులర్ అయ్యారు. నటుడు క్రిష్ పాఠక్‌తో ఆమె వివాహం 2005లో వార్తల్లో నిలిచింది. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ డిస్కషన్ పాయింట్ అయ్యింది.
కూడా చదవండి: Dragon Glimpse Decoded – ఎన్టీఆర్ ‘డ్రాగన్’ గ్లింప్స్‌లో హిడెన్ డీటెయిల్స్… ప్రశాంత్ నీల్ సీక్రెట్ క్లూస్ గమనించారా?
ఇంకా చదవండి

