అస్సాంలోని జోర్హాట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో భారత వాయుసేనకు చెందిన AN-32 రవాణా విమానం శనివారం కుప్పకూలింది. వెంటనే జరిగిన విమానానికి మంటలు అంటుకున్నట్లు ప్రాథమిక సమాచారం.ఎయిర్ ఫోర్స్ స్టేషన్లోనే ఈ ప్రమాదం చోటుచేసుకోవడంతో అత్యవసర సహాయక బృందాలు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకుని చర్యలు చేపట్టారు. అయితే ఈ ప్రమాదం ఎలా జరిగింది? విమానంలో ఎంతమంది సిబ్బంది ఉన్నారు? ఎవరైనా మృతి చెందారా లేదా గాయపడ్డారా? అనే విషయాలపై ఇంకా స్పష్టత రాలేదు.
ప్రమాదాన్ని ధ్రువీకరించిన వాయుసేన
ఈ ఘటనను భారత వాయుసేన ధ్రువీకరించింది. పరిస్థితిని పూర్తిగా అంచనా వేసిన అనంతరం మరిన్ని వివరాలను వెల్లడిస్తున్నట్లు సమాచారం.ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది.కాగా, కొన్ని నెలల క్రితం భారత వాయుసేనకు చెందిన సుఖోయ్ Su-30వీఖI యుద్ధ విమానం ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే.
మార్చి 5న జోర్హాట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి సాధారణ శిక్షణా విహారయాత్ర కోసం బయలుదేరిన ఆ యుద్ధ విమానం సాయంత్రం 7:42 గంటల సమయంలో గ్రౌండ్ కంట్రోల్‌తో సంబంధాలు పోయాయి.
గతంలో కూడా ప్రమాదం
అనంతరం విమానం రాడార్ నుంచి అదృశ్యమైంది.
తర్వాత జోర్హాట్కు సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న కర్బీ ఆంగ్లాంగ్ ఏర్పాటు కొండ ప్రాంతంలో విమానం కుప్పకూలినట్లు అధికారులు పేర్కొన్నారు.ఆ ప్రమాదంలో ఇద్దరు వాయుసేన పైలట్లు ప్రాణాలు కోల్పోయారు.

