ఆంధ్రప్రదేశ్:రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు భారీ వర్షం కురిసింది.దీనితో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
మరో 3 గంటల్లో రాష్ట్రంలోని పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి APSDMA గుర్తింపు.పశ్చిమ గోదావరి,ఏలూరు, ఎన్టీఆర్,కృష్ణా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్,కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
మచిలీపట్నం, ఏలూరు, నర్సాపురం, దివిసీమ, గుడివాడ, భీమడోలు పరిసర ప్రాంతాలలో పిడుగులు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

