అమరావతిలో ఈరోజు కూటమి నేతల సమావేశం జరగనుంది. సాయంత్రం సీఎం చంద్రబాబు నివాసంలో ఎన్డీఏ కూటమి నేతలు భేటీ కానున్నారు. తాజా రాజకీయ పరిణామాలతో పాటు కీలక విషయాలపై కూటమి నేతలు చర్చించనున్నారు. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, బీజేపీ ఏపీ అధ్యక్షులు మాధవ్ హాజరుకానున్నారు.SIRపై మూడు పార్టీల నేతలు కలిసి క్షేత్రస్థాయిలో సమన్వయం చేసుకోవడంపై ప్రధానంగా చర్చ జరగనుంది.
ఎస్ఐఆర్, రాజ్యసభ ఎన్నికలపై…
ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ఈ నెలలో ప్రారంభమవుతున్నందున మూడు పార్టీలు కలసి తమ ఓటు బ్యాంకుకు ఇబ్బందులు లేకుండా చూడాలన్న దానిపై చర్చించనున్నారు. మరొకవైపు త్వరలో జరిగే రాజ్యసభ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై చర్చించే అవకాశం ఉంది. ఈ నెల 8వ తేదీతో నామినేషన్లకు గడువు ముగియనున్న అభ్యర్థుల ఎంపికపై కూడా చర్చకు వచ్చే ఛాన్స్ ఉంది.

