- సూర్యవంశీ మ్యాచ్‌ను మార్చేసింది..
- భారీ ఛేజింగ్‌కు భాగస్వామ్యాలు అవసరమని శ్రీలంక కెప్టెన్..
భారత్ ‘ఎ’ చేతుల్లో ట్రై-నేషన్ సిరీస్ ఫైనల్ మ్యాచ్‌లో ఓటమి అనంతరం శ్రీలంక ‘ఎ’ జట్టు కెప్టెన్ సహన్ అరాచిగే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ ఆడిన మెరుపు యువ ఇన్నింగ్స్, అలాగే ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లలో భారత్ వేగంగా పరుగులు రాబట్టడమే తమ ఓటమికి ప్రధాన కారణాలని ఆయన అంగీకరించారు.
పవర్ ప్లేలోనే మ్యాచ్‌ను లాగేసుకున్నాడు.
మ్యాచ్ ముగిసిన తర్వాత ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ వేడుకలో సహన్ అరాచ్చిగే మాట్లాడుతూ భారత బ్యాటింగ్‌ను, ముఖ్యంగా 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీని మనస్ఫూర్తిగా అభినందించారు. “పవర్ప్లెలో వైభవ్ సూర్యవంశీ నిజంగా ఒక అద్భుతమైన ఆట ఆడాడు. అతని హిట్టింగ్ మా బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టేసింది. ఆరంభం అతను మ్యాచ్‌ని మా నుంచి దూరం చేశాడు. ఆ తర్వాత మిడిల్ ఓవర్లలో మేము మ్యాచ్‌లోకి తిరిగి రావడానికి ప్రయత్నించాడు, చివరి రెండు ఓవర్లు కూడా పూర్తిగా భారత్ వైపు మొగ్గు చూపాయి.

భారీ ఛేజింగ్‌లో పెద్ద ఇన్నింగ్స్‌లు అవసరం..
378 పరుగుల భారీ లక్ష్య ఛేదనపై అరాచిగే భాగస్వామ్యానికి సంబంధించి, “ఇంత పెద్ద స్కోరును ఛేజ్ చేస్తున్నప్పుడు జట్టులో ఒకరిద్దరు బ్యాటర్ల నుంచి భారీ ఇన్నింగ్స్‌లు రావాల్సి ఉంటుంది. మా జట్టులో వనుజ సహన్ (62), సదీర సమరవిక్రమ (52) బాగానే పోరాడారు. చెప్పారు.

యువకులకు మంచి అనుభవం..
టోర్ ముగింపుపై లంక కెప్టెన్ వ్యక్తం చేస్తూ, “ఫైనల్లో ఓడిపోవడం నిరాశ కలిగించింది, ఓవరాల్‌గా ఇదొక మంచి టోర్నమెంట్.

