Tollywood Re Release : టాలీవుడ్ లో ఇప్పుడు ఆసక్తికరమైన పోరుకి తెరలేచింది. గత ఏడాది రీ రిలీజ్ ట్రెండ్ ఏ రేంజ్ లో ఉంటుందో అందరికీ తెలిసిందే. ఈ ట్రెండ్ లో పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు , ప్రభాస్ చిత్రాలు సెన్సేషన్ క్రియేట్ చేశాయి. అయితే ఈ ముగ్గురు హీరోలకు సంబంధించిన అభిమానులు రీ రిలీజ్ ట్రెండ్ కింగ్ మా హీరోనే అంటూ కొట్లాడుకుంటూ ఉంటారు. ఎందుకంటే రికార్డ్స్ ఈ ముగ్గురికే ఎక్కువ ఉన్నాయి కాబట్టి. అయితే ఈ ముగ్గురిలో ఎవరు తోపు అనేది ఒక క్లారిటీ రాబోయే మూడు నెలల్లో తేలిపోనుంది. ఆగస్టు 9 న మహేష్ బాబు పుట్టిన రోజు కాగా, సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ , అక్టోబర్ 23 న ప్రభాస్ పుట్టిన రోజులు. ప్రతీ ఏడాది లాగానే , ఈ ఏడాది కూడా ఈ ముగ్గురి హీరోల అభిమానులు వీళ్ళ పుట్టినరోజు ని ఒక పండుగ లాగా జరుపుకుంటారు.
అంతే కాకుండా మహేష్ పుట్టిన రోజు సందర్భంగా పోకిరి సినిమా భారీ లెవెల్ లో రీ రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్న మేకర్స్, పవన్ కళ్యాణ్ పుట్టిన రోజున పంజా రీ రిలీజ్ చేయనున్నారు. ఇక ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఆయన కెరీర్ లో ల్యాండ్ మార్క్ గా నిలిచిన మిర్చి రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూడు సినిమాలకు మంచి క్రేజ్ ఉంది , అభిమానులు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ మూడు సినిమాల్లో ఏ సినిమా ఎక్కువ వసూళ్లు వస్తే , వాళ్ళని రీ రిలీజ్ కింగ్ గా భావిస్తున్నాము అంటూ సోషల్ మీడియా లో అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతానికి ‘పోకిరి’ చిత్రానికి ఎక్కువ వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఎందుకంటే ఆగష్టు 9న ఈసారి ఆదివారం రాబోతుంది. సెలవు రోజున పోకిరి లాంటి సినిమా ని రీ రిలీజ్ చేస్తే గ్రాస్ వసూళ్లు ఊహించడం కూడా కష్టమే. ఇక ఆ తర్వాత ఎక్కువ గ్రాస్ వసూళ్లు రాబట్టే ఛాన్స్ మిర్చి సినిమాకు ఉంది. ఎందుకంటే ఈ సినిమా శుక్రవారం రోజు విడుదల కాబోతుంది. వీకెండ్ కాబట్టి భారీ గ్రాస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక పంజా మూవీ విషయానికి వస్తే , ఇది బుధవారం రోజున విడుదల కాబోతుంది. పూర్తి స్థాయి వర్కింగ్ డే లో విడుదల కాబోతున్న సినిమా, పైగా ఫ్లాప్ మూవీ, ఆడియన్స్ ఏ స్థాయిలో ఆదరిస్తారో అనే భయం కాస్త అభిమానుల్లో ఉంది. అయితే ఈ సవాళ్ళను దాటుకొని , ఈ చిత్రం అత్యధిక వసూళ్లు వస్తే , తెలుగు రాష్ట్రాలు ఇంకా పవన్ కళ్యాణ్ ఆధీనంలో ఉన్నట్టే అనుకోవాలి.

