పుస్తకాలకు పత్రికలకు చదువరులు తగ్గిపోతున్న ప్రస్తుత ఆడియో రూపంలో వచ్చే కథలకు ఆదరణ పెరుగుతోంది. యూట్యూబ్‌లో వినిపించే ఈ కథల కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు. అరుదైన కథలు కూడా ఇటీవల కాలంలో ఆడియో రూపంలో వచ్చి అలరిస్తున్నాయి. ఫోన్ల తర్వాత ప్రింటింగ్ పుస్తకాలు తగ్గిపోయిన నేపథ్యంలో కంప్యూటర్లలోనూ చూసి చదవడం పట్ల ఆసక్తి లేనివారు దృష్టిదోషం మందగించిన వారు ఈ కథలను వినడానికి ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. పదేళ్ల క్రితం ఒకరిద్దరు వీటిని వినిపించేవారు. కానీ ఇటీవల కాలంలో దాదాపు పాతికమంది వరకు ఇదే పనిలో ఉన్నారు. కొత్త కథలతో పాటు పాతకథలు, ప్రముఖ రచయితల పేరుపొందిన కథలను కూడా ఆడియో రూపంలో చూసి యూ ట్యూబులో వదులుతున్నారు. కథలకు ముందు రాసే రైటప్‌ను చదివి ఈ కథలను వింటున్నారు. ఈ విధంగా వినిపిస్తున్న వారు తమ పత్రికకు లైకులు కొట్టాలని చందాదారులుగా చేరాలని కోరుతున్నారు. ఈ విధంగా చేరితే మీరు వినిపించే కొత్త కథలు అన్నీ కోరకుండా మీలో ప్రత్యక్షం అవుతుందని ఫోన్ చెబుతోంది. ఈ పుస్తకాలు చదవలేని ఒక వర్గానికి చెందిన సాహిత్యాభిమానులు ఈ ఆడియో కథల పట్ల ఆసక్తిని చూపిస్తున్నారు. వీరి ఆసక్తికి అనుగుణంగా ఆదరణ ఉన్న రచయితల రచనలను విరివిగా వినిపిస్తున్నారు. కొంతమంది అయితే నవలలను కూడా ఆడియో రూపంలో చేసి పదిహేను భాగాలుగా కూడా విడుదల చేస్తున్నారు. మంచి ఉచ్ఛరణ, పదాలు పలకడంలో స్పష్టత ఉన్నవారు చదివిన కథలు వింటుంటే ఎప్పుడో పత్రికలో చదివిన అనుభూతి కన్నా ఎక్కువ ఆనందాన్ని పొందగలుగుతున్నారు. ఇతర తీరిక సమయంలోనూ ప్రయాణాలు చేసే సమయంలోనూ ఈ ఆడియో కథలు వినడానికి చాలామంది ఇష్టపడుతున్నారు. ఒకప్పుడు మధుర గీతాలను హాయిగా వినే అనేకమంది నేడు ఆడియో కథలు వినడానికి ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. పత్రికలలో వచ్చిన రచనలు మరింత మందికి చేరువ కావడానికి కొంతమంది రచయితలే తమ కథలను ఆడియో రూపంలో చదవాలని యూట్యూబ్ నిర్వాహకులను ఆహ్వానిస్తున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి.
కథామంజరి పేరుతో విజయనగరం నుంచి ఆన్లైన్ పత్రికను తీసుకుని వస్తున్న రచయితలు ఆ పత్రికలో ప్రచురించిన కథలను కూడా ఆడియో రూపంలో రూపొందించారు. కథలు చదువుకోవచ్చు లేదా వినవచ్చు అనే విధానం ఈ పత్రికలో అమలులో ఉంది. పత్రికలో ప్రచురించిన పది పదిహేను కథల్లో ఒక్కో కథóŠను ఒక్కొక్కరి గళంతో చదివే ప్రయోగం కూడా చేస్తున్నారు.
కథలు వినిపించేవారు ఎందరో??
ఆడియో కథలను వినిపించే వారిలో రచయితలు రచనల గురించి అవగాహన ఉన్నవారు అయితే రాసిన భావం సూటిగా చెప్పడానికి ప్రయత్నిస్తారు. మాటల్లో విరుపులు మారÆవం, పలుకుల్లో స్పష్టత వంటి విధానాల వల్ల ఈ కథలు వినడానికి ఆసక్తి నెలకొంది. ఆమెరికాలో ఉంటున్న కౌముది వ్యవస్థాపకులు కిరణ్‌ప్రభ అనేక టాక్ షోలలో ఉన్నారు. వీటిలో మంచి కథóŠలను కూడా వినిపిస్తున్నారు. కథను యధాతధంగా చదవడం కాకుండా దానిని సూటిగా హత్తుకునే విధంగా కథ రూపంలో చెప్పడం ఈయన ప్రత్యేకత. అదే విధంగా జపాన్ నుంచి కథాభారతి పేరుతో ఇటీవల వస్తున్న కథలను శ్రీధర్ అనే వ్యక్తి వారానికో కథ ప్రకారం వినిపిస్తున్నారు. కథాసంకలంలో బహుమతి పొందిన కథóŠలను ఎక్కువగా ఎంపిక చేసుకుని వాటిని చదువుతుంటారు. వీరు కాకుండా అనేకమంది ఈ కధలను వినిపించడంలో ఎంతో ముందుకు వెళ్లిపోయారు.కథ చెబుతాను ఊ కొడతారా పేరుతో సునీత అనేక కథóŠలను ముఖ్యంగా వంశీ రాసిన కథలను ఆడియో రూపంలోకి తీసుకుని వచ్చారు. వెంపటి కామేశ్వరరావు వినిపించే కథలు, లక్ష్మీˆ చెప్పే కథలు, పంతుల స్వాతి చదివే కథలు కథాస్రవంతి పేరుతో పప్పు బోగారావు చదివే కథలు కొప్పర్తి రాంబాబు అనే విశ్రాంత ఉద్యోగి కొప్పర్తి కథావాహిని పేరుతో చాలా ఎక్కువగా యూ ట్యూబ్‌లో ఉంటాయి. వీటితో పాటు జి. కె.లక్షˆణశాస్త్రి, రాధిక చదివే కథలు కధానికలు ఖజానా, బండారు హరిత చదివే కథా ప్రపంచం, హైమ చదివే తెలుగు స్టోరీస్ కూడా ఎంతో ప్రసిద్ధి పొందాయి. ఈ కథలు చదివేవారు పాపులర్ కథాసంకలనాలలో కథలను చదువుతుంటారు. కొన్ని వారం వారంలో విభిన్నమైన కథలు చదవడానికి ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. ఇటీవల కాలంలో కొంతమంది యండమూరి వీరేంద్రనాధ్ నవలలను ఆడియో రూపంలో తీసుకుని వచ్చారు. రంగనాయకమ్మ కథలు నవలలు కూడా ఈ ఆడియో రూపంలో వస్తున్నాయి. ఈ విధంగా కధలు చదువుతున్న అనేక మందిలో రచనల పట్ల అవగాహన ఉన్నవారే ఎక్కువమంది ఉన్నారు. కొంతమంది రచయితలు తమ కథలను తామే చదువుకునే పరిస్థితి కూడా ఉంది. మహమ్మద్ ఖదీర్‌బాబు కత్తిపద్మ వంటి వారు ఎంతో చక్కగా తమకథలను ఆడియో రూపంలో తామే వెలుగులోకి తీసుకుని వస్తున్నారు. దిగువ గోదావరి కథలు, పసలపూడికథóŠలు, అమరావతి కథలు, అగ్రహారం కథలు వంటి గ్రామాల పేర్లతో రాసిన వాటిని కూడా ఆడియో రూపంలో తీసుకుని రావడానికి చాలామంది ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. ఇప్పటి వరకు వందలాదికథలు ఈ విధంగా ఆడియో రూపంలో బైటికి వచ్చాయి. ఒక్కో ఛానల్ వారు 500 నుంచి వెయ్యి వరకు కథలను నంబర్ల వారిగా విడుదల చేస్తున్నారు. ఈ ఆడియో కథలను సబ్‌స్క్రైబ్ చేసుకుంటే ఈ కథలు విడుదల కాగానే వారికి నేరుగా చేరుతుంటాయి.
కొంతమంది ఆడియోలు తయారు చేసేవారు ఇతర భాషలలో మంచి కథలను కూడా ఆడియో రూపంలో తీసుకుని వచ్చారు. గోపీచంద్ అసమర్దుని జీవయాత్రతో పాటు రాహుల్ సాంకృత్యాన్ రాసిన ఓల్గా సే గంగా, బెంగాలీ కొన్ని రచయిత శరత్‌బాబు అనువాద నవలలు, భార్య శీల వీర్రాజు మైనా, పురాణం సుబ్రమణ్యశర్మ నీలి కథ, పాలగుమ్మి పద్మరాజు గాలివాన, పడవ ప్రయాణం, బాలగంగాదర్ తిలక్ రాసిన మైదానంలో నల్లజర్ల రోడ్డు, గుడిపాటి వెంకటాచలం వంటి కథలు కూడా ఉన్నాయి. వెలుగులోకి వచ్చాయి. ప్రముఖ రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి రాసిన అనేక కథలను ఆడియో రూపంలోకి తీసుకుని వచ్చారు.
చాలా మంది అనేక కథలు ఆడియో రూపంలో చదవలేని సాహిత్యాభిమానులకు వీటి పట్ల ఆసక్తి పెరిగింది. పాత తరానికి చెందిన వారివి సైతం ఆడియో రూపంలో లభిస్తున్నాయి. ఆడియో కథలు ఎక్కువ వినడానికి వీలుగా వీటిని విడుదల చేస్తున్నవారు రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు.
పిల్లల కథలు కూడా
సాంఘీక కథలే కాకుండా చిన్న పిల్లలని ఆకర్షించడానికి కొంతమంది బాల సాహిత్యాన్ని కూడా ఆడియో తీసుకుని వస్తున్నారు. పిల్లల కథలు అంటే వినడానికి ఆసక్తి కలిగించడానికి ఇటువంటి ఆడియోలకు బొమ్మలను కూడా జత చేసిన కథలను విడుదల చేస్తున్నారు. ఇటీవల కాలంలో పిల్లల నవలలు కూడా విడుదల అవుతున్నాయి. చాలామంది పిల్లలు వీటిని చూస్తూ వినడానికి ఎంతో ఇష్టపడుతున్నారు. ఏది ఏమైనా రానున్న కాలంలో ఆడియో కథలు మరింత అలరించే అవకాశం ఉంటుంది.
పొత్తూరు రాజేంద్రప్రసాద్‌వర్మ
9440527387

