ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఎయిర్ పోర్టుకు 1580 ఎకరాలు ఇవ్వడానికి సిద్దమైన రాష్ట్ర సర్కార్ ప్రతిపాదన లేఖను రక్షణ శాఖ జైంట్ సెక్రెటరీ మహంతికి అందించారు ఎమ్మెల్యే పాయల్ శంకర్. ఈమెరకు ప్రభుత్వం ఇచ్చిన లేఖ పట్ల సానుకూలత రాష్ట్ర కేంద్రం.
రక్షణ శాఖకు చెందిన 400 ఎకరాలు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే1580 ఎకరాలు కలిపి1980 ఎకరాల్లో ఎయిర్ ఫోర్స్ స్టేషన్, ఎయిర్ పోర్టు నిర్మాణం సానుకూలంగా ప్రదర్శించిన కేంద్రం
కేంద్రం నిర్ణయంపై సంతోషం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే పాయల్ శంకర్. ఎయిర్ పోర్ట్ నిర్మాణంపై సానుకూలంగా ఉన్న ప్రధాని మోడీ, సీఎం రేవంత్ కు క్రుతజ్ఞతలు తెలిపారు ఎమ్మెల్యే పాయల్ శంకర్.

