న్యూఢిల్లీ: ఆన్లైన్ బెట్టింగ్ నైపుణ్యానికి సంబంధించిన ఆట ఉన్నప్పటికీ రాజ్యాంగ రక్షణ ఉండబోదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. వివిధ క్రీడలపై ఆన్లైన్ బెట్టింగ్ లను నిషేధిస్తూ తమిళనాడు, కర్నాటక చేసిన చట్టాల రాజ్యాంగతను సమర్థించింది. ఆన్లైన్ బెట్టింగ్, గేమింగ్ చట్టాలు రూపొందించేందుకు రాష్ట్రాలకు పూర్తి అధికారం ఉందని జస్టిస్ పార్థివాలా, జస్టిస్ ఆర్.మహదేవన్‌తో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. సమాజ హితం, శాంతి భద్రతల దృష్ట్యా ఆన్లైన్ గేమింగ్ ప్లాట్‌ఫామ్‌లపై నిషేధం విధించడాన్ని సమర్థిస్తున్నట్లు ప్రదర్శించారు.

