ఏపీ/తెలంగాణ:ఆన్లైన్లో ప్రిస్క్రిప్షన్ మందుల విక్రయాలను నిరసిస్తూ తెలుగు రాష్ట్రాల్లో మెడికల్ షాపులు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నాయి.ఆల్ ఇండియా కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్ పిలుపు మేరకు ఫార్మసీలు మూతపడడంతో పలు మందులను కొనుగోలు చేయడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ… నియంత్రణ లేకుండా జరుగుతున్న ఆన్లైన్ మందుల విక్రయాలు స్థానిక మెడికల్ షాపులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని తెలిపారు.
ఆన్లైన్ వ్యాపారాల కారణంగా చిన్న,మధ్య తరహా మెడికల్ దుకాణాలు ఆర్థికంగా నష్టపోతున్నాయని, వేలాది మంది ఉపాధిపై ప్రభావం పడిందని పేర్కొన్నారు.ప్రభుత్వం వెంటనే ఆన్లైన్ మందుల విక్రయాలపై కఠిన నియంత్రణలు అమలు, నిబంధనలు ఉల్లంఘించే సంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

