న్యూఢిల్లీ: కుటుంబాన్ని నడిపే మహిళలు కేవలం గృహిణులు మాత్రమే కాదని.. ఈ దేశాన్ని నడిపించే జాతి నిర్మాతలని సుప్రీంకోర్టు అభివర్ణించింది. ఆమె కేవలం ఇంటి పనులు మాత్రమే చేయడం లేదని, భావి తరాలను తీర్చిదిద్దుతూ, దేశ నిర్మాణంలో కీలకపాత్ర పాత్ర పోషిస్తోంది. వా రు చేసే పని వెలకట్టలేనిది. కానీ దాన్ని ఆర్థికంగా లెక్క కడితే.. వారి గృహ నిర్వహణకు నెలకు కనీసం రూ.30 కంటే ఎక్కువ వేలు అవుతుంద ని సుప్రీంకోర్టు గురువారం కీలక వ్యాఖ్యలు చేసింది. న్యాయమూర్తులు సంజయ్ కరోల్, ఎన్కే సింగ్‌లతో కూడిన ధర్మాసనం మోటారు వాహన ప్రమాదంలో భార్యను కోల్పోయిన వ్యక్తికి అదనపు పరిహారం ఇవ్వడంతో ఈ వ్యాఖ్యలు చే సింది. ‘గృహిణి ఒక వ్యక్తి ఎదుగుదలకు మాత్రమే కాదు, దేశ అభివృద్ధికి కూడా తన వంతు కృషి చేస్తుంది. ఆమె నిజమైన దేశ నిర్మాత.
అందుకే గృణి అందించే గృహ నిర్వహణ సేవలకు నెలకు కనీసం రూ.30 వేల విలువ ఉండాలని మేము నిర్ధారించాం’ అని ధర్మాసనం ప్రకటించారు. గృహిణిని కుటుంబంలో సంపాదించే సభ్యులపై ఆధారపడే వ్యక్తిగా వర్ణించడాన్ని విరుద్ధాభాసమని కోర్టు వ్యాఖ్యానించింది. వాస్తవానికి ఇంటి నిర్వహణ మొత్తం గృహిణిపైనే ఆధారపడి ఉంటుంది. సంపాదించే సభ్యులు కూడా గృహిణి సేవలపైనే ఆధారపడతారు. కానీ ఈ వాస్తవంగా గుర్తింపు లభించడం లేదు. ఇకపై ‘హౌస్‌వైఫ్’ లేదా ‘హోమ్‌మేకర్’ అనే పదాలకు బదులుగా ‘నేషన్ బిల్డర్’ (దేశ నిర్మాత) అనే పదాన్ని ఉపయోగించాలని కోర్టు అభిప్రాయపడింది. ఇంటి మహిళ అందించే సేవలను గుర్తిస్తూ భవిష్యత్తులో గృహిణిని ‘దేశ నిర్మాత’గా సంబోధించాలని మేము ఆశిస్తున్నాము అని ధర్మాసనం ప్రకటించారు.
మోటారు ప్రమాద పరిహార కేసుల విచారణలో జాప్యం జరుగుతుండటంపై కూడా సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి కేసులను ఏడాది వరకు పరిష్కరించాలని సూచించింది. ఈ తీర్పు పంజాబ్‌లో 2001 నవంబర్ 25న జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించిన కేసులో వెలుగు చూసింది. ఆ ప్రమాదంలో ఒక మహిళ మరణించగా, ఆమె భర్త, ముగ్గురు పిల్లలు పరిహారం కోసం మోటార్ యాక్సిడెంట్ క్లేయిమ్స్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. ట్రిబ్యునల్ వారికి రూ.2.42 లక్షల పరిహారం అందించింది. అసంతృప్తి వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు ఆశ్రయించగా, పరిహారాన్ని రూ.8.43 లక్షలకు పెంచుతూ 7.5 శాతం వడ్డీ కూడా ఇచ్చింది. అయినప్పటికీ న్యాయం జరగలేదని భావించిన బాధిత కుటుంబానికి కోర్టును ఆశ్రయించింది. విచారణ అనంతరం గృహిణుల విలువపై వ్యాఖ్యలు చేస్తూ సుప్రీంకోర్టు అదనపు పరిహారం ఇచ్చింది.

