ఢిల్లీ: రాష్ట్రంలో ఆయిల్ పామ్ విస్తరణకు కేంద్రం కృషి చేయాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. దిగుమతులపై సుంకం తగ్గించడం వల్ల ఆయిల్ పామ్ రైతులకు నష్టం అని అన్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దిగుమతి చేసుకుంటున్న ఎడిబుల్ ఆయిల్లో కొంత వెసులుబాటు లభిస్తుంది, దిగుమతి సుంకం పెంచి పామాయిల్ రైతులను ప్రోత్సహించాలని తుమ్మల సూచించారు. రాబోయే 2-3 ఏళ్లలో 10 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగుకు చర్యలు చేపట్టామని, ఆయిల్ దిగుమతుల భారాన్ని తగ్గిస్తామని చెప్పారు. గతంలోనే మాదిరిగా ఆయిల్ దిగుమతుల సుంకం 44 శాతం ఉంచాలని, రాష్ట్రానికి కేటాయించిన యూరియా, డిఎపి తెలంగాణకు రాలేదని అన్నారు. సేకరించిన జొన్న, మొక్కజొన్నలను కేంద్రం కొనుగోలు చేయడానికి తుమ్మల నాగేశ్వరరావు నిర్ణయించారు.

