నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ నాయకులు
విశాలాంధ్ర ధర్మవరం;; ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపుమేరకు ఎండి మెమరాండంలోని సమస్యల పరిష్కారం కోసం రెండు రోజుల డిమాండ్‌లో భాగంగా మొదటి రోజున ఎన్ఎంయూ ఏ డిపో సెక్రటరీ మధుసూదన్ ఆధ్వర్యంలో ఉదయం మొదటి సర్వీస్ నుండి డిమాండ్ బ్యాడ్జిను ధరించి నిరసన, గేట్ మీటింగ్ నిర్వహించారు. అనంతరం జోనల్ శేఖర్, ఏఎస్ రావు రీజినల్ నాయకులు ముత్యాలప్ప మోహన్ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ విద్యుత్ బస్సులను ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేయాలని ఆర్టీసీ సిబ్బంది ద్వారానే ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. శ్రీ శక్తి బస్సులలో జీరో టికెట్ ఇచ్చే నిలుపుదల చేసి ఇతర ప్రయాణికులకు టికెట్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకొని సిబ్బందిపై పని భారం తగ్గించాలని వారు డిమాండ్ చేశారు. పిఆర్సి కమిటీ వెంటనే నియమించి ఐఆర్‌ను ప్రకటించాలని పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏలు అరియర్స్ లీవ్ ఎన్కాష్మెంట్ ప్రకటించాలని కోరారు. ప్రయాణికులకు సరిపడా కొత్త బస్సులను వెంటనే కొనుగోలు చేసి అన్ని కేటగిరీల్లో ఖాళీలను భర్తీ చేయడానికి అనుమతించారు. ఏపీపీ టీడీపీ ఉద్యోగులను ఈ హెచ్ఎస్ నుంచి మినహాయించి గతంలో ఆర్టీసీ నందు ఉన్న వైద్య సదుపాయాన్ని అమలు చేసింది. ఈ కార్యక్రమంలో నాగప్ప గ్యారేజ్ అధ్యక్ష కార్యదర్శులు ప్రసాద్ ,హరికృష్ణ డిపో అధ్యక్షుడు గోపాలప్ప, ట్రెజరర్ వైవిఆర్ రెడ్డి, సీనియర్ నాయకులు ఖాన్, ఏడీసీ శ్రీనివాసులు, ఎన్సీజీ రావు అధిక సంఖ్యలో ఉద్యోగులు ఉన్నారు.

