- తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి హనుమంతు
ముషీరాబాద్, వెలుగు: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ మజ్దూర్ యూనియన్ వ్యవస్థాపక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఈ నెల 24 నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని ప్రకటించారు.
బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జూన్ 2న ఆర్టీసీ విలీనం ప్రకటన విడుదల చేసిన ప్రభుత్వం తెలిపిన ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన రాకపోవడంతో ఉద్యోగులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు.
2019 సమ్మె సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి. కొన్ని సంఘాలు తప్పుదోవ పట్టిస్తూ కార్మికులకు అన్యాయం సమాచారం అందించిన నాయకులు. సమావేశంలో యూనియన్ గోలి రవీందర్, సాములయ్య, ప్రేమ్‌నాథ్, సుధాకర్, మురళి, పాండు నాయకులు ఉన్నారు.

