- భూమిపై ఉండాలనుకుంటున్నారా.? చరిత్రలో కలవాలనుకుంటున్నారా?
- పాకిస్థాన్‌కు ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది స్ట్రాంగ్ వార్నింగ్..
ఆర్మీ చీఫ్: భారత ఆర్మీ జనరల్ ఉపేంద్ర ద్వివేది పాకిస్థాన్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పాకిస్తాన్ ఇలాగే ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తూ, భారత్‌కు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే, ఆ దేశం భౌగోళికంగా ఉండాలనుకుంటున్నారా? లేదా చరిత్రలో భాగంగా కావాలనుకుంటున్నారో తేల్చుకోవాలని ఆయన అన్నారు. ఆపరేషన్ సిందూర్ జరిగి ఏడాది గడుస్తున్న సమయంలో ఆర్మీ చీఫ్ నుంచి ఈ వ్యాఖ్యలు రావడం. మరోసారి పహల్గామ్ దాడి జరిగితే భారత సైన్యం అదే రీతిలో లేదా అంతకన్నా ఎక్కువ తీవ్రతతో ఉన్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: జయం రవి: 14 ఏళ్లు బానిసలా బతికా.. ‘నా పిల్లలను కూడా చూడనివ్వట్లేదు’ అంటూ ఏడ్చేసిన జయం రవి..
ఢిల్లీలోని మానేక్షా సెంటర్లో ‘యూనిఫామ్ అన్వీల్డ్’ నిర్వహించిన ఒక ఇంటరాక్టివ్ సెషన్లో ఉపేంద్ర ద్వివేది ఈ వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు పహల్గామ్ ఉగ్రవాద దాడి చేసిన 26 మందిని పొట్టనపెట్టుకున్నారు. దీని తర్వాత మే 7న భారత్ ”ఆపరేషన్ సిందూర్” పేరుతో పాకిస్థాన్, పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలపై భారీ దాడి చేసింది. ఈ దాడిలో వందలాది మంది ఉగ్రవాదులు హతమయ్యారు. దీని తర్వాత పాకిస్తాన్ సైన్యం భారత్‌పై దాడి చేయడానికి ప్రయత్నించింది, పాక్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన ఎయిర్ బేసుల్ని భారత్ ద్వంసం చేసింది.

