హైదరాబాద్: ముంబయి టి20 లీగ్‌లో అర్జున్ టెండూల్కర్ అటు బంతి ఇటి బ్యాట్‌తో రాణించి ఒంటి చేత్తో మ్యాచ్‌ను గెలిపించాడు. బాంద్రా బ్లాస్టర్ టీమ్‌పై అంధేరీ జట్టు ఘన విజయం. బంద్రా బ్లాసర్స్ టీమ్ 145 పరుగుల లక్ష్యాన్ని అంధేరీ జట్టు ముందు ఉంచింది. అర్జున్ టెండూల్కర్ 34 బంతుల్లో ఐదు సిక్స్‌లు, నాలుగు ఫోర్లతో 66 పరుగులు చేయడంతో చివరి వరకు క్రీజులో ఉండి ఒంటి చేత్తో మ్యాచ్‌ను గెలిపించాడు. మూడు ఓవర్లు బౌలింగ్ 11 పరుగులు ఇచ్చి మూడు కీలక వికెట్లు తీసి బంద్రా జట్టు నడి విరిచాడు. గత కొద్ది సంవత్సరాలుగా వివిధ లీగ్‌లలో ఆడుతూ తన సొంత కష్టం మీద పైకి వస్తున్నాడు. ఐపిఎల్‌లో మాత్రం ఇప్పటివరకు అర్జున్ సరైన అవకాశాలు రాలేదు.

