కొరటాల శివ: సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకుడు డిఫరెంట్ కాన్సెప్ట్ లతో సినిమాలను చేసి స్టార్ డైరెక్టర్లు ఎదగాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇలాంటిదే కొరటాల శివ లాంటి దర్శకుడు సైతం మొదట రైటర్ గా తన కెరియర్ ను మొదలుపెట్టినప్పటికి దర్శకుడిగా మారి మిర్చి సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించాడు. ప్రభాస్ కెరియర్ లో బిగ్గెస్ట్ సక్సెస్ ని అందించిన ఆయన ఆ తర్వాత మళ్లీ చూడకుండా వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ ముందుకు సాగాడు. ఇక ఇలాంటిదే అల్లు అర్జున్ లాంటి నటుడు సైతం తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ప్రస్తుతం పాన్ ఇండియాని శాసించే స్థాయికి ఎదుగుతున్నాడు అంటే మామూలు విషయం కాదు. ఇక అల్లు అర్జున్ కొరటాల శివ తో ఒక సినిమా చేయాలనుకున్నాడట. మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ వరుస సక్సెస్లను అందుకున్న కొరటాల శివతో అతను సినిమా చేస్తే బాగుంటుందని తన సన్నిహితులు కూడా భావించారు. దాంతో అల్లు అర్జున్ కొరటాలను పిలిపించి మరి ఒక కథను రెడీ చేయమని చెప్పారట.
కానీ అప్పటికే కొరటాల శివకు మహేష్ బాబుతో ‘భరత్ అను నేను’ సినిమా చేసే కమిట్మెంట్ వల్ల అల్లు అర్జున్ తో సినిమా చేయడం కుదరలేదు. ఇక ఆచార్య తర్వాత వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ఒక సినిమా రావాల్సింది. కానీ అనుకోని కారణాల వల్ల ఆ సినిమా పట్టాలెక్కలేదు…
దాంతో ఆయన ఎన్టీఆర్ తో దేవర సినిమా చేసి సక్సెస్ ని సాధించాడు. ప్రస్తుతం బాలయ్య బాబుతో ఒక ఫుల్ పవర్ ఫుల్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో కూడిన ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు… ఈ సినిమా కనక పర్ఫెక్ట్ గా కుదిరితే మాత్రం కొరటాల శివ మరోసారి తన సత్తా చాటుకున్నవాడు అవుతాడు.
లేకపోతే ఆయన చాలా వరకు డీలా పడిపోయే ప్రమాదం ఉంది. నిజానికి కొరటాల ప్రతి సినిమాలో కమర్షియల్ హంగులన్నీ ఉంటాయి. ప్రతి సన్నివేశాన్ని మీటర్ మీద కొలిచినట్టుగా ఎంత భావోద్వేగంగా ఉండాలి, ఎంత యాక్షన్ ఎపిసోడ్స్ ఉండాలి అనేది చాలా కాలిక్యులేటెడ్ గా చేసి మరి సక్సెస్ సాధిస్తూ ఉంటాడు…

