వెంకటేష్ మరియు దర్శకుడు వివాదం తెలుగు సినిమా ఇండస్ట్రీలో విక్టరీ వెంకటేష్ పేరు చెబితే చాలు ఫ్యామిలీ సినిమాలు మాత్రమే గుర్తుకొస్తాయి. ఎందుకంటే అతను ఫ్యామిలీ సినిమాలను చేసి ప్రేక్షకులను థియేటర్ కి రప్పించాడు. ముఖ్యంగా ఆయన లాంటి నటుడు ఇండస్ట్రీలో ఉండటం నిజంగా మన ఇండస్ట్రీ చేసుకున్న అదృష్టమనే చెప్పాలి. శోభన్ బాబు తర్వాత ఆ రేంజ్ లో ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పించిన నటుడు కూడా తనే కావడం విశేషం… వెంకటేష్ సినిమా పండక్కి వచ్చిందంటే ఆ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తుంది. అవతలిపక్క ఏ హీరో ఉన్నా వెంకటేష్ సినిమా చూసిన తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ మిగిలిన వాళ్ళ సినిమాలను చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు.
ఇక గత సంవత్సరం సంక్రాంతికి పండక్కి వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో కూడా భారీ సక్సెస్ సాధించిన ఘనత అతనికే దక్కింది… అలాంటి వెంకటేష్ ప్రస్తుతం డిఫరెంట్ సినిమాలను చేయడానికి ఆసక్తి చూపాడు.
తేజ వెంకటేష్‌తో 10 సంవత్సరాల క్రితం నుంచి ఒక సినిమా డైరెక్టర్‌గా తయారై వచ్చాడు. కానీ ఆ సినిమా ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదు. కారణం ఏదైనా కూడా తేజ కి వెంకటేష్ వాళ్ళ అన్నయ్య సురేష్ బాబుకి మధ్య చాలా మంచి స్నేహం ఉంది. అందుకే రానా ని హీరోగా పెట్టి ‘నేనే రాజు నేనే మంత్రి’ అనే సినిమా చేశాడు.
ఆ మూవీ సూపర్ సక్సెస్ ని సాధించింది. ఇక సురేష్ బాబు చిన్న కొడుకు అయిన అభిరామ్ ను హీరోగా పెట్టి అహింస మూవీ చేశాడు. వెంకటేష్ తో ఎలాంటి సినిమా చేస్తే బాగుంటుందనే ఆలోచనలో తేజఉన్నారట. గతంలో వెంకటేష్ కి ఒక మంచి కథ వినిపించినప్పటికి అది చివరి నిమిషంలో పట్టాలెక్కలేదు. ఎందుకనిళ్ళ కాంబినేషన్లో సినిమా సెట్ అవ్వడం లేదనే ధోరణిలో కూడా వాళ్ళ అభిప్రాయాలను వీక్షిస్తున్నారు… మరి వెంకటేష్ తేజ కాంబినేషన్లో ఒక సినిమా పడితే ఆ మూవీకి నెక్ట్స్ లెవెల్ క్రేజ్ దక్కుతుంది…

