Pawan Kalyan OG 2: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాలు చేస్తాడా లేదా?, ఉప ముఖ్యమంత్రిగా ఫుల్ బిజీ గా ఉన్నాడు, ఇక సినిమాలకు దాదాపుగా రిటైర్మెంట్ ఇచ్చినట్టే అని అందరూ అనుకుంటున్న సమయంలో , నిన్న సోషల్ మీడియా లో ఒక అను బాంబు పేలింది. ‘ఓజీ 2’ చిత్రం ఆన్ ది ట్రాక్ ఉందని , సుజిత్ ఇండియా కి తిరిగి రాగానే ఈ సినిమాకు సంబంధించిన బ్లాస్టింగ్ అప్డేట్ అవుతుందని పవన్ కళ్యాణ్ టీం ఒక అధికారిక ప్రకటన చేసింది. ఈ ఒక్క ప్రకటన సృష్టించిన సునామీ సాధారణమైనది కాదు, ఈ ఒక్క ట్వీట్ కివ్యూ దాదాపుగా 76 లక్షలకు పైగా వచ్చాయి, ట్విట్టర్ మొత్తం ఓజీ 2 గురించి చర్చ, ఇన్ స్టాగ్రామ్లో కూడా ఎక్కడ చూసిన ‘ఓజీ 2’ మేనియాతో నిండిపోయింది.
దీని గురించి కేవలం టాలీవుడ్ , బాలీవుడ్ , కోలీవుడ్ మాత్రమే కాదు , ఏకంగా హాలీవుడ్ గురించి కూడా చర్చించుకోవడం. హాలీవుడ్ లో పాపులర్ మ్యాగజైన్ ‘వెరైటీ’ అనే సంస్థ , ‘ఓజీ 2’ గురించి ఒక ఆర్టికల్ రాసింది. ఈ చిత్రం నవంబర్ నెల నుండి మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని , మొదటి భాగం ప్రపంచవ్యాతంగా 35 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించిందని , ఇది కేవలం తెలుగు వెర్షన్ కి సంబంధించిన వసూళ్లు మాత్రమే అని, ఓవర్సీస్ ప్రీమియర్స్ లో హాలీవుడ్ క్రేజీ సినిమాలను సైతం ఓజీ డామినేట్ చేసిందని ఒక సంచలనాత్మక ఆర్టికల్ రాశారు. దీనిని చూసి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ , కేవలం ఒకే ఒక్క ట్వీట్ తో ఇంటర్నేషనల్ లెవల్ లో ఓజీ 2 గురించి చర్చలు జరిగాయి , ఈ సినిమాకు ఉన్న క్రేజ్, హైప్ వేరే లెవెల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ ‘అతన్ని OG 2 అని పిలుస్తారు’ అని ధృవీకరించారు, నవంబర్ తర్వాత షూటింగ్ ప్రారంభం https://t.co/l0btfCM2Xd
– వెరైటీ (@వెరైటీ) జూన్ 12, 2026

