తెలంగాణ:భారతదేశం నుంచి 21 మందిలో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుంచి ఒకే ఒక్కడిగా ఇండిగో ఎయిర్ లైన్స్ క్యాడెడ్ పైలట్ (ఇండిగో ఎయిర్‌లైన్స్ క్యాడెట్ పైలట్) గా ఎంపికైన సూర్యాపేట వాసి జశ్వంత్( జస్వంత్ ).ఓ సామాన్య విద్యార్థి అసమాన్య ప్రతిభను కనబరిచి పైలట్ కావాలని లక్ష్యంగా చేసుకొని దృఢ సంకల్పంతో ముందుకు సాగి, నేడు ఆ లక్ష్యాన్ని చేరుకొని సూర్యాపేట ఆణిముత్యంగా నిలిచాడు సూర్యాపేట జిల్లాకు చెందిన నట్టే కిరణ్ కుమార్-సునిత దంపతుల కుమారుడు నట్టే జశ్వంత్.
జశ్వంత్ చిన్ననాటి నుంచి పైలట్ కావాలనే కోరిక బలంగా తల్లిదండ్రుల కోసం బీటెక్ చేశాడు.అనంతరం 85వేల రూపాయల వేతనంతో జీవితం బాగానే సాగుతున్నానని అనుకున్న లక్ష్యం చేరుకోలేకపోయానన్న ఆవేదనతో ఉద్యోగానికి రాజీనామా చేసి పైలట్ కావాలనే లక్ష్యంతో తిరిగి తన చదువును ప్రారంభించాడు.
కష్టపడే తత్వం బలమైన సంకల్పంతో జశ్వంత్ ఇండిగో ఎయిర్‌లైన్స్ నిర్వహించిన పరీక్షల్లో భారతదేశం నుంచి వేల మంది పోటీ పరీక్షలు రాయగా భారతదేశం నుంచి 21 మంది ఎంపికయ్యారు.21 మంది ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుంచి నట్టే జశ్వంత్ ఒక్కరే ఇండిగో ఎయిర్‌లైన్స్ క్యాడెట్ పైలెట్‌గా ఎంపికయ్యారు. జశ్వంత్ సాధించిన ఈ విజయం ప్రతి విద్యార్థికి ఆదర్శనీయమని ఇంతటి విజయం సాధించిన నట్టే జశ్వంత్ ను సూర్యాపేట పట్టణ ప్రముఖులు అభినందిస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
సూర్యాపేట( సూర్యాపేట ) చరిత్రలో పైలట్ గా పనిచేసిన వారు లేరని నట్టే జశ్వంత్ ఇండిగో ఎయిర్‌లైన్స్ క్యాడెట్ పైలెట్‌గా ఎంపిక కావడం ఎంతో గర్వకారణమని కొనియాడారు.క్యాడేట్ పైలట్ గా శిక్షణ పూర్తి చేసుకుని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షిస్తూ తల్లిదండ్రుల కృషిని కొనియాడారు.

