కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకాగాంధీ స్పందించారు. ఇది భారతీయ యువత సాధించిన విజయం అన్నారు ప్రియాంకాగాంధీ. రాజ్యాంగాన్ని నాశనం చేయాలనుకున్నవారి నుంచి దేశ ప్రజలు తమ దేశాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంటున్నారని అన్నారామె. జెన్ జెడ్ ఉద్యమంలో యువత విజయం సాధించేందుకు బలం కాంగ్రెస్ పార్టీ అందించిందని అన్నారు.
గత రెండేళ్లుగా ఎగ్జామ్ పేపర్ లీకేజీలు, పరీక్షల నిర్వహణ విధానంలో సంస్కరణలకు రాహుల్ పోరాటం, ఎగ్జామ్ పేపర్ లీక్ కోసం లేవనెత్తడమే కాకుండా, విద్యార్థులు మద్దతివ్వడంలోనూ దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని నిర్మించడంలోనూ కాంగ్రెస్ యూత్ ను ప్రేరేపించారని ప్రియాంక అన్నారు.
ఈ రోజు చాలా సంతోషంగా ఉంది.. ఇది ఆరంభం మాత్రమే.. యువత తిరుగబడితే ఏం జరుగుతుందో ఈ ఉద్యమంతో ప్రభుత్వాలకు తెలిసిపోయింది.ఆర్ ఎస్ విద్యావ్యవస్థను పూర్తిగా ఆక్రమిస్తోంది.. పూర్వీకుల భావజాలాన్ని దెబ్బతీసేలా చేస్తోంది. దేశ యువత తమ గళాన్ని వినిపించింది.. ఇకపై యువత గొంతును అణచివేసే సాహసం ఎవరూ చేయలేరని అన్నారు కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకాగాంధీ.
#చూడండి | వాయనాడ్ | కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా ఇలా అన్నారు, “నేను చాలా కారణాల వల్ల చాలా సంతోషంగా ఉన్నాను, కానీ ప్రధాన కారణం ఏమిటంటే, ఈ రోజు మన దేశ ప్రజలు తమ క్లెయిమ్ చేయడం ప్రారంభించిన రోజు అని నేను నమ్ముతున్నాను. pic.twitter.com/AJxYmNJ7mx
— ANI (@ANI) జూలై 25, 2026

