విదేశీ ప్రయాణాలపై సెస్,సర్ ఛార్జీలను విధించాలని కేంద్రం యోచిస్తోందని వస్తున్న వార్తలను ప్రధాని మోదీ తీవ్రంగా ఖండించారు. ఇది పూర్తిగా అవాస్తం..ఇందులో రవ్వంత కూడా నిజం లేదు..విదేశీ ప్రయాణాలపై అలాంటి ఆంక్షలు విధించే ప్రసక్తే లేదని..మా ప్రజల వ్యాపారం, జీవన సౌలభ్యం మెరుగుపర్చేందుకు మేం కట్టుబడి ఉన్నామని ప్రధాని ఎక్స్‌లో పోస్ట్ షేర్ చేశారు.
విదేశీ ప్రయాణాలపై తాత్కాలిక సెస్ లేదా సర్‌చార్జ్ విధించే అవకాశంపై అత్యున్నత స్థాయిలో చర్చలు జరుగుతున్నాయని ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ ఒక మీడియా ప్రచారం చేసింది. నివేదిక ప్రకారం.. పశ్చిమాసియాలో యుద్దం కారణంగా పెరుగుతున్న ముడి చమురు, దిగుమతి ఖర్చులతో ఉత్పన్నమయ్యే ఆర్థికాన్ని ఎదుర్కొనేందుకు విదేశీ ప్రయాణాలపై ఆంక్షలు విధించే అవకాశం ఉందని తెలిపింది. విదేశీ ప్రయాణాలపై విధించే ఏ సెస్, సర్‌చార్జ్ నేరుగా కేంద్రానికి వెళ్తుంది, ఇది ఒక తాత్కాలిక చర్యగా ఒక సంవత్సరం పాటు అమలులో ఉండేందుకు ఆ రిపోర్టు ఇవ్వబడుతుంది. అయితే ఈ ప్రతిపాదనకు సంబంధించిన ప్రశ్నలకు ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పందించలేదని కూడా ఆ రిపోర్టులో చెప్పారు.
ఇదిలా ఉంటే.. అమెరికా , ఇరాన్ యుద్దం కారణంగా తలెత్తిన ప్రపంచ ఇంధన సంక్షోభంతో విదేశీ మారక నిల్వలను తగ్గకుండా బంగారం కొనుగోలుకు దూరంగా ఉండాలని, ఏడాది పాటు అత్యవసరం కానీ విదేశీ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని ప్రధాని మోదీ.. మే 10న హైదరాబాద్‌లో జరిగిన బహిరంగ సభలో పౌరులకు విజ్ఞప్తి చేశారు.
ఇది పూర్తిగా అబద్ధం.
ఇందులో ఒక్క ముక్క కూడా నిజం లేదు.
విదేశీ ప్రయాణాలపై అలాంటి ఆంక్షలు పెట్టే ప్రశ్నే లేదు.
మా ప్రజల కోసం ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ మరియు ‘ఈజ్ ఆఫ్ లివింగ్’ మెరుగుపరచడానికి మేము కట్టుబడి ఉన్నాము. https://t.co/9lxjbxz0nV
– నరేంద్ర మోదీ (@narendramodi) మే 15, 2026

