ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత అభిజిత్ దీప్కే సంచలన వ్యాఖ్యలు
ప్రధాన్ రాజీనామాపై CJP అధ్యక్షుడు అభిజిత్ దీప్కే
నీట్ పేపర్ లీక్‌కు వ్యతిరేకంగా సీజేపీ నాయకత్వంలో విద్యార్థులు ఆందోళనలకు దిగారు. విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పదవి నుంచి తప్పుకున్నారు. కాక్రోచ్ జనతా పార్టీ హర్షం వ్యక్తం చేసింది. ఇది దేశ యువత సాధించిన విజయమని సీజేపీ అధ్యక్షుడు అభిజిత్ దీప్కే పేర్కొన్నారు. అయితే, ఇదే సమయంతో రాజీనామాతోనే సమస్య ముగిసిపోలేదని, ఇది మొదటి వికెట్ అని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతరం కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ ) కార్యకర్తలు జంతర్ మంతర్ వద్ద సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా సీజేపీ అధ్యక్షుడు అభిజిత్ దీప్కే మాట్లాడుతూ.. ”ఇది మొదటి వికెట్.. మేము ఇక్కడితో ఆగం… ఇది ఆరంభం మాత్రమే. గత 36 రోజులుగా ఇక్కడ కూర్చున్న విద్యార్థులకు, వాలంటీర్లందరికీ సెల్యూట్’’ అని అన్నారు.
తమ మిగిలిన రెండు డిమాండ్లు నెరవేర్చే వరకు నిరసన కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. భయపడని వారు గెలవగలరని ప్రధాన్ రాజీనామా నిరూపించారని అన్నారు. పేపర్ లీక్ తర్వాత ఆత్మహత్య చేసుకున్న పిల్లల కుటుంబాలకు ప్రభుత్వం కోటి రూపాయల పరిహారం అందించడానికి, జులై 20న నిరసనకారులపై పోలీసులు క్రూరంగా ప్రవర్తించారనే ఆరోపణలపై చర్య తీసుకునేందుకు తాను అక్కడినుంచి వెళ్లబోమని ఆయన తేల్చిచెప్పారు.
”ప్రజాస్వామ్యంలో మాట్లాడటానికి భయపడకూడదు. మీరు గొంతు విప్పితేనే వారు అదుపులో ఉంటారు, ఎందుకంటే మన వల్లే వారు అధికారంలో ఉన్నారు.. శాంతియుతంగా చేస్తే ఏ నిరసనతోనైనా లక్ష్యం తప్పక నెరవేరుతుంది.. దీనికి గాంధీజీయే స్ఫూర్తి.. ఆయన నుంచి నేర్చుకున్నా.. ఈ దేశ యువత శాంతియుత ఆందోళనలు వృథాగా పోలేదు. విద్యార్థుల పోరాటం ఫలించింది.ఈ విజయం విద్యార్థులది. ప్రజాస్వామ్యం అంటే ఇదే” అని హర్షం వ్యక్తం చేశారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కూడా విమర్శలు చేస్తూ,”నరేంద్ర మోదీ జీ.. ఇది ఆరంభం మాత్రమే, మొదటి వికెట్. పోరాటం ఇంకా ముగియలేదు.. మాకు మరో రెండు డిమాండ్లు ఉన్నాయి. మేం అలా వెళ్లిపోం… మేం బొద్దింకలం. ఒకసారి లోపలికి వస్తే, బయటకు వెళ్లండి. ప్రస్తుతానికి ఒక రాజీనామా మాత్రమే జరిగింది.. బొద్దింకతో పెట్టుకోవద్దు’ అని ఆయన అన్నారు.
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం, నీట్ పేపర్ లీక్ వివాదంలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులకు కోటి రూపాయల పరిహారం చెల్లించాలని, ఈ లీక్‌కు బాధ్యులైన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని సీజేపీ డిమాండ్ చేస్తోంది. ఈ మూడు డిమాండ్లకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది.
పోస్ట్ ఇది ఫస్ట్ వికెట్ మాత్రమే.. మొదట కనిపించింది విశాలాంధ్ర.

