ఒకప్పుడు స్టాక్ మార్కెట్ అంటే యువతకు “మిస్ అవ్వకూడని అవకాశం”. ఇప్పుడు అదే మార్కెట్ ముందు వాళ్లు ఒక అడుగు వెనక్కి వేస్తున్నారు. నిజానికి ఇది వెనకడుగు కాదు.. ఒక ఆలోచన. స్టాక్ మార్కెట్ అప్పట్లో యువతకు అవకాశాలు ప్రపంచంగా కనిపించాయి. ముఖ్యంగా కోవిడ్ తర్వాత డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు ఈజీగా అందుబాటులోకి రావడంతో జెన్ జెడ్ పెద్ద సంఖ్యలో పెట్టుబడుల వైపు అడుగులు వేసింది.
ఆ సమయంలో వాళ్లను ముందుకు నడిపించిన భావన “FOMO” (ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్) అంటే ఇతరులు లాభాలు పొందుతున్నప్పుడు మనం వెనకపడకూడదనే ఆత్రుత. కానీ కాలక్రమేణా మార్కెట్ పరిస్థితులు మారాయి. ఎప్పుడూ పైకి వెళ్లేలా కనిపించిన స్టాక్స్ ఒక్కసారిగా ఊగిసలాటకు లోనయ్యాయి. లాభాలు తగ్గాయి. కొన్ని సందర్భాల్లో నష్టాలు కూడా ఎదురయ్యాయి. ఈ అనుభవాలు యువతలో కొత్త భావనను తెచ్చాయి. అదే “FOWT” (ఫియర్ ఆఫ్ రాంగ్ టైమింగ్).. అంటే తప్పు సమయంలో పెట్టుబడి పెట్టామేమో అనే భయం.
ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఆర్థిక, రాజకీయ పరిణామాలు కూడా ఈ మార్పుకు కారణమయ్యాయి. దేశాల మధ్య ఉద్రిక్తతలు, గ్లోబల్ మార్కెట్లలో అనిశ్చితి, వడ్డీ రేట్ల మార్పులు అన్నీ కలిసి మార్కెట్‌ను అస్థిరంగా మార్చాయి. ఈ ఎఫెక్ట్ భారత మార్కెట్ పైనా స్పష్టంగా కనిపించింది. ముందుగా స్టాక్ మార్కెట్‌ను ఈజీగా లాభాలు ఇచ్చే సాధనంగా చూసిన యూత్, ఇప్పుడు దానిలోని రిస్క్‌ను గమనించడం స్టార్ట్ చేసింది. అయితే ఈ మార్పును పూర్తిగా నెగెటివ్‌గా చూడలేం. ఇది ఒక అవగాహన పెరుగుదలగా కూడా చూడొచ్చు. ముందు ట్రెండ్ చూసి పెట్టుబడులు పెట్టిన ఈ తరం ఇప్పుడు మార్కెట్ స్వభావాన్ని అర్థం చేసుకుంటోంది.
►ఇంకా చదవండి | యూత్ మెచ్చిన బెల్లం.. జాగర్కెన్
రిస్క్, టైమింగ్, స్ట్రాటజీ.. ఇవన్నీ అవసరమవుతాయి. ఎక్స్పర్ట్స్ కూడా ఇది మార్కెట్ నుంచి పూర్తిగా పక్కకు వెళ్లడం కాదు. ఒక చిన్న విరామం మాత్రమే. ఈ విరామం ద్వారా వారు మరింత జాగ్రత్తగా, తెలివిగా పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందని అంటున్నారు.
మొత్తంగా చూస్తే, ఫోమో నుంచి ఫౌట్ వరకు జరిగిన ఈ ప్రయాణం యూత్ ఇన్వెస్ట్మెంట్ ఆలోచనలో వచ్చిన మార్పును చూపుతుంది. ఒకప్పుడు మిస్ అవ్వకూడదనే ఉత్సాహం ఉంటే, ఇప్పుడు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాలనే ఆలోచన పెరిగింది. ఈ మార్పు ఫ్యూచర్లో మరింత రెస్పాన్సిబిలిటీ, అవేర్నెస్ కలిగిన ఇన్వెస్టర్లను తయారు చేయగలదని అంటున్నారు ఎక్స్పర్ట్స్.
మీరూ లైఫ్ కి పిల్లల కథలు పంపాలి అనుకుంటున్నారా? అయితే.. కథను హామీపత్రంతోపాటు featureseditor@v6velugu.com కి మెయిల్ చేయండి.

