: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై ప్రియాంక గాంధీ
నీట్-యూజీ పరీక్షల అవకతవకల వివాదం నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక వాద్రా హర్షం వ్యక్తం చేశారు. ఇది సాధించిన యువత విజయమని, వారి గొంతును ఎవరూ అణచివేయలేరని ఆమె స్పష్టం చేశారు.శనివారం తన లోక్‌సభ నియోజకవర్గమైన కేరళలోని వయనాడ్‌లో విలేకరులతో మాట్లాడిన ప్రియాంక, ధర్మేంద్ర ప్రధాన రాజీనామా వార్త తనను కొంత భావోద్వేగానికి గురిచేసిందని చెప్పారు. “గత పది, పన్నెండేళ్లుగా మన యువత ఎప్పుడు చైతన్యవంతమవుతుందా అని నేను అనేకసార్లు ప్రశ్నించుకున్నాను. నేడు దేశం గళం విప్పింది, వారి గొంతు వినిపించింది. ఇది చాలా సంతోషకరమైన విషయం” అని ఆమె అన్నారు. ఈ ఘటన ద్వారా గుణపాఠం నేర్చుకోవాలి. కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ), పర్యావరణవేత్త సోనమ్ వాంగ్‌చుక్ మద్దతుతో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనలు ఉద్ధృతంగా జరిగాయి. కేంద్ర మంత్రి రాజీనామా చేయవలసింది వారి ప్రధాన డిమాండ్‌గా ఉంది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను ప్రజాస్వామ్య విజయంగా సిజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే, సోనమ్ వాంగ్‌చుక్ అభివర్ణించారు.

