ఇరుముడి సినిమా: కెరియార్ మొదటి నుంచి కూడా కమర్షియల్ సినిమాలను చేస్తూ సూపర్ సక్సెస్ లను సాధిస్తున్న నటుడు రవితేజ… మధ్యలో కొన్ని ప్రయోగాత్మకమైన సినిమాలు చేసిన కూడా అవి ఆశించిన స్థాయిలో సక్సెస్ లను సాధించి చాలావరకు డీలా పడ్డాడు. ఇక ఎట్టకేలకు ఆయన ఇప్పుడు ‘ఇరుముడి’ సినిమాతో మరో భారీ ప్రయోగం చేస్తున్నాడు. ఇక ఈ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇక రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించిన రషెస్ ను మెగాస్టార్ చిరంజీవి చూశారట…ఈ సినిమా అతనికి విపరీతంగా నచ్చిందనే వార్తలైతే వస్తున్నాయి. నిజానికి చిరంజీవికి అంత ఈజీగా ఏ సినిమా నచ్చదు.
కానీ రవితేజ చేసిన ఈ సినిమా అతనికి నచ్చడమే కాకుండా ఈ మూవీ లో మనం కొత్త రవితేజ ని మనం చూడబోతున్నాం సినిమా మేకర్స్ తో కూడా చెప్పారట. మొత్తానికైతే శివ నిర్వాణ ఈ సినిమా ను చాలా అద్భుతంగా తెరకెక్కిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది.
ఇంతకుముందు లవ్ స్టోరీస్ చేసిన ఆయన ఇప్పుడు సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ లో కూడా సినిమా సక్సెస్ ఫుల్ గా తెరకెక్కించగలిగేలా మెచ్చుకున్నారట. ఇక ఏది ఏమైనా రవితేజ ఇందులో ఊర మాస్ క్యారెక్టర్ లో కనిపిస్తూనే తన కూతురి కోసం తండ్రి పడే బాధ ఎలా ఉంటుంది. ఒక అయ్యప్ప స్వామి భక్తుడు తనకు వచ్చిన ప్రాబ్లమ్స్ ని ఎలా ఎదుర్కొన్నాడు అనేది కూడా క్లారిటీగా చూపించబోతున్నట్టుగా తెలుస్తుంది.
ఇక ఏది ఏమైనా కూడా ఇరుముడి సినిమా రవితేజ కెరియర్ లోనే బ్లాక్ బస్టర్ సక్సెస్ గా మారుతుందని చిరంజీవి చెప్పిన మాటలను సినిమా యూనిట్ అయితే బాగా నమ్ముతున్నారు. ఇక తొందరలోనే ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆగస్టు 21వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించిన ప్రతి పనిని శరవేగంగా పూర్తి చేస్తున్నారు…

