లక్నో: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించి కూడా చాలన్లు కట్టేందుకు కొందరు బుకాయిస్తుంటారు. కానీ ఓ బీజేపీ ఎమ్మెల్యే మాత్రం తాను ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించానని బహిరంగంగా ఒప్పుకోవడమే కాకుండా పోలీసులను ట్రాఫిక్ చలాన్ వేయాలని అడిగి మరీ ఆ జరిమానా వెంటనే చెల్లించాడు. ఈ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. పోలీసులను అడిగి మరీ చలాన్ వేయించుకుని ఫైన్ కట్టిన ఆ ఎమ్మెల్యే ఎవరో.. ఏంటో ఆదర్శ వివరాలు చూద్దాం..
బీజేపీ నేత, డియోరియా ఎమ్మెల్యే శలభ్ మణి త్రిపాఠి హెల్మెట్ ధరించకుండా బైక్ నడుపుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో ఎమ్మెల్యే, పోలీసుల తీరుపై విమర్శలు వ్యక్తమయ్యాయి. సామాన్యులకు ఒక రూల్ ప్రజాప్రతినిధులకు ఒక రూలా అని ప్రశ్నించారు. దీంతో ఎమ్మెల్యే త్రిపాఠి బహిరంగంగా తన తప్పును ఒప్పుకుని.. ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసినందుకు తనకు చాలన్ విధించాలని పోలీసులను అడిగి మరీ ఫైన్ కట్టాడు.
►ఇంకా చదవండి | సొంత తీర్పును తప్పుబట్టిన సుప్రీం కోర్టు ధర్మాసనం.. ఉమర్ ఖలీద్ బెయిల్ నిరాకరణపై అసంతృప్తి
ఈ ఘటనపై ఎమ్మెల్యే త్రిపాఠి మాట్లాడుతూ.. పార్టీకి చెందిన ఓ కార్యకర్త కొత్త బైక్ కొనుగోలు చేసి దానిని నడిపించాలని కోరినట్లు తెలిపారు. అతడి అభ్యర్థన మేరకు హెల్మెట్ లేకుండా బైక్ నడిపానని చెప్పాడు. ఏదేమైనప్పటికీ హెల్మెట్ లేకుండా బైక్ డ్రైవ్ చేయడం ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించడమే తప్పు అని అంగీకరించారు. ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసిన తనకు చలాన్ విధించాలని తానే పోలీసులను కోరానని చెప్పాడు.
పోలీసులు రూ.100 జరిమానా విధించిన వెంటనే చెల్లించాలని తెలిపారు. ట్రాఫిక్ చట్టాలను పాటించడానికే కాకుండా, మన సొంత భద్రత కోసం కూడా హెల్మెట్ ధరించడం అత్యంత అవసరమని చెప్పారు. దయచేసి నేను చేసిన తప్పును మీరు చేయకండి.. వాహనం నడుపుతున్నప్పుడు తప్పకుండా హెల్మెట్ ధరించండి, నిర్లక్ష్యంగా ఉండకండి.

