ఫ్రాన్స్‌లో అతిపెద్ద 3D ప్రింటెడ్ భవనం: మనకు ఇల్లు కట్టుకోవాలని ఉంటే ఏం చేస్తాం.. ముందు సరైన స్థలం కొనుగోలు చేస్తాం. ఆ తర్వాత ఇంజనీర్ ను పిలిపించి ప్లానింగ్ గీయించుకుంటాం. తాపీ మేస్త్రిని పిలిపించుకొని మన స్తోమత తగ్గట్టుగా ఇల్లు నిర్మించుకుంటాం. కానీ ఇప్పుడు ఇల్లు నిర్మించే విషయంలో కూడా మార్పులు వస్తున్నాయి. క్రమేపి ఇంటి నిర్మాణం కొత్త పుంతలు తొక్కుతోంది.
కొద్దిరోజుల క్రితం ఫ్రాన్స్ లో ఒక నిర్మించారు. దానిని నిర్మించారు అని చెప్పడం కంటే.. ప్రింట్ చేశారు అనడం సబబు.. దాదాపు మూడు అంతస్తులలో.. 12 పోర్షన్లు ఉన్నాయి. ఈ భవనంలో ఉన్న కోడలు మొత్తం ప్రింటింగ్ టెక్నాలజీతో పూర్తి చేశారు. నిర్మాణంలో బలం ఉండడానికి స్తంభాలను పాతారు. కాలమ్స్.. పై కప్పులను నిర్మించారు. ఆ తర్వాత తలుపులను.. కిటికీలు.. వైరింగ్.. బాత్రూం.. ఇతర వాటిని దశలవారీగా అమర్చారు. అయితే ఒక సాధారణ ఇంటిని నిర్మించడానికి పట్టే సమయానికంటే మూడు నెలలు ముందుగానే దీనిని పూర్తి చేశారు.
ఫ్రాన్స్ లోని అత్యంత చారిత్రాత్మకమైన నగరం రిమ్స్ ప్రాంతంలో దీనిని నిర్మించారు. 800 చదరపు మీటర్ల వైశాల్యం తో.. అత్యాధునికమైన ఫైబర్.. కాంక్రీట్ వంటి వాటిని వాడి నిర్మించారు. అత్యంత నాణ్యమైన ఫైబర్ వల్ల ఈ భవనంలో పిల్లల సంఖ్య చాలా వరకు తగ్గింది. త్రిడి విధానంలో ప్రింటింగ్ టెక్నాలజీతో కాంక్రీట్ వాడకం కూడా సరిగ్గా సాగింది. అంతేకాదు, 10 శాతం కాంక్రీట్ వాడకాన్ని తగ్గించారు. గత మార్చి ఏడాది నెలలో 3డి ప్రింటింగ్ మొదలుపెట్టారు. ఆ తర్వాత 34 రోజుల్లోనే ఆ త్రీడీ ప్రింటింగ్ పూర్తి చేశారు.. మిగిలిన పనులు దశలవారీగా పూర్తి చేశారు. నెలలో ఈ భవనం ఏర్పాటు.. కో బోడ్ బాడ్ -2 అంటే అత్యాధునికమైన త్రీడీ ప్రింటర్ ను దీనికోసం ఉపయోగించారు. ఈ యంత్రం గతంలో భూకంపాలను తట్టుకునే ఇల్లు.. సమాచార కేంద్రాన్ని త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీతో పూర్తి చేయడం ఇక్కడ విశేషం.
మన దేశంలో ఎలా ఉందంటే
3డి ప్రింటింగ్ టెక్నాలజీ అనేది మనదేశంలో కూడా సాగుతూనే ఉంది. ఇప్పటికైతే ప్రారంభ దశలోనే ఉంది. సరిగ్గా ఐదు సంవత్సరాల క్రితం మద్రాస్ ఐఐటి త్వస్థ పేరుతో త్రీడీ ప్రింటెడ్ ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసింది. 600 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించిన ఈ ఇల్లు అప్పట్లో చాలా మందిలో విపరీతమైన ఆసక్తిని కలగజేసింది. త్వస్త తో పాటు ఎల్ అండ్ టి సంస్థ కూడా గృహ నిర్మాణాలను వేగంగా చేపట్టేందుకు 3డి ప్రింటింగ్ టెక్నాలజీని ఉపయోగిస్తోంది. దీని ద్వారా ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో భాగంగా ఇళ్లను నిర్మించేందుకు ప్రణాళికలను రూపొందించారు.
ఫ్రాన్స్‌లో, ఐరోపాలో అతిపెద్ద 3D-ప్రింటెడ్ రెసిడెన్షియల్ భవనం నిర్మాణం పూర్తయింది
ప్రాజెక్ట్‌లో మూడు అంతస్తులలో 12 సోషల్ హౌసింగ్ అపార్ట్మెంట్లు ఉన్నాయి.
కంపెనీ ప్లూరియల్ నోవిలియా దీనిని ప్రణాళికాబద్ధమైన 50కి బదులుగా 34 రోజుల్లో నిర్మించింది. మొత్తం ప్రక్రియ… pic.twitter.com/abH9ltZ5Ce
— NEXTA (@nexta_tv) జూన్ 1, 2026

