ఈడీ నోటీసులపై విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ స్పందించారు.తన సతీమణికి నోటీసులంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యవహారంలో కంపెనీకి మాత్రమే నోటీసులు వచ్చాయన్న కేశినేని చిన్ని లిక్కర్ స్కాంపై లేదని స్పష్టం చేశారు. రాజ్ కెసిరెడ్డితో వ్యాపార సంబంధాలు ప్రతి ఒక్కరికీ ఈడీ నోటీసులు అందాయని కేశినేని చిన్ని తెలిపారు.
తాను, రాజ్ కెసిరెడ్డి కలసి ఓ సైట్ డెవలప్ చేద్దామనుకున్నామని 2020-21 మధ్య సైట్ డెవలప్మెంట్లో భాగంగా, రూ.35 లక్షల లావాదేవీలు జరిగినట్లు కేశినేని చిన్ని వివరించారు. రాజ్ కెసిరెడ్డితో తనకు వ్యక్తిగతంగా ఎలాంటి లావాదేవీలు లేవని నోటీసులకు సమాధానం ఇస్తానని, తాను ఏ తప్పు చేయలేదని ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. తన భార్యకు ఎటువంటి నోటీసులు అందలేదని చెప్పారు.

