IRCTC Food Complaint: శీర్షిక చదివారు కదా.. ఈగ విలువ లక్ష రూపాయలు అని అర్థమైంది కదా.. అదేంటి ఈగలను పరాన్న జీవి వాహనంగా భావిస్తారు కదా.. పైగా ఈగలకు దూరంగా ఉంటారు కదా.. వాటికి లక్ష రూపాయలు ఎలా ఖర్చు పెడతారు.. అసలు అది అలా సాధ్యమవుతుంది.. ఇలా అనేక రకాల ప్రశ్నలు మీలో వ్యక్తమవుతున్నాయి కదా..
అహ్మదాబాద్, ముంబై మధ్యలో తేజస్ రాజధాని అనే పేరుతో రైల్వే శాఖ ఎక్స్ ప్రెస్ రైలు నడుపుతుంది. ఈ రైలు కొన్ని ఎంపిక చేసిన స్టేషన్లలో మాత్రమే ఆగుతూ ఉంటుంది. ఈ రైలులో ఒక వ్యక్తి ప్రయాణం చేస్తున్నాడు. ఈ ఐఆర్సిటి యాప్ ద్వారా ఆహార ముందుగానే బుక్ చేసుకున్నాడు. అతడు ఆ రైలులో ప్రయాణిస్తున్నప్పుడు ఐఆర్ సి టి సి నిర్వాహకులు ఫుడ్ డెలివరీ చేశారు.
ఫుడ్ పార్సెల్ ఓపెన్ చేసి అతడు తినడం మొదలుపెట్టాడు. అందులో ఒక ఈగ కనిపించింది. వెంటనే అతడు ఐఆర్సిటిసి అధికారులకు కంప్లైంట్ చేశాడు. సమాచారం అందుకున్న రైలు కెప్టెన్… వెంటనే ప్రయాణికుడిని కలిశారు. క్షమాపణ చెప్పారు. ఆ ఫుడ్ పార్సెల్ స్థానంలో మరొక ప్యాకెట్ అందిస్తామని వారు చెప్పారు. దానికి ఆ ప్రయాణికుడు ఒప్పుకోలేదు. కోర్టుకు వెళ్తామని హెచ్చరించడంతో.. ఐఆర్సిటిసి అధికారులు రంగంలోకి దిగారు. ఆ ప్రయాణికుడికి భోజనాన్ని సరఫరా చేసిన అర్హ హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు లక్ష రూపాయలు జరిమానా విధించారు.
ఈ కంపెనీకి సూరత్ నగరంలో ఆహారం తయారు చేసే కేంద్రం ఉంది. కేంద్రానికి సంబంధించిన లైసెన్స్ మొత్తం రద్దు చేసింది ఐఆర్సిటిసి షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆహార కేంద్రాన్ని త్వరలో మూసివేస్తారని. ఒక ప్రయాణికుడు ఎంతో ఆశతో.. ఆహారం బుక్ చేస్తే.. చివరికి అందులో ఈగ పడడం.. అది అతడికి కంటపడడం.. ఐఆర్సిటిసికి ఫిర్యాదు చేయడం.. లక్ష రూపాయలు జరిమానా విధించడం… జాతీయ స్థాయిలో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు, మనదేశంలో హాస్పిటల్ ఎలా వ్యవహరించాయో మరోసారి వెలుగులోకి వచ్చింది.

