ఏ రిలేషన్ కు అయినా మంచి కమ్యూనికేషన్ పునాది. అది స్నేహమైనా, కుటుంబమైనా, లేదా ఆఫీసు వాతావరణమైనా, చక్కగా కమ్యూనికేట్ చేయడం అనేది మనుషులను దగ్గర చేస్తుంది. కానీ కొన్నిసార్లు తెలియకుండానే అవతలి వ్యక్తికి కలిగించే ప్రశ్నలు అడుగుతుంటారు. అడిగేవారి ఉద్దేశాలు తప్పు కాకపోయినా, కొన్ని వ్యక్తిగత ప్రశ్నలు ఇతరులకు నచ్చకపోవచ్చు , పైగా ఇలాంటి ప్రశ్నలు అడగడం వల్ల ఎదుటివారు బాధపడతారు. నేటి కాలంలో తమ వ్యక్తిగత జీవితాల పట్ల చాలా మందికి ఎక్కువ శ్రద్ధ ఉంటోంది. అయితే ప్రతి వ్యక్తికి వారి స్వంత హద్దులు , వ్యక్తిగత గోప్యత ఉంటాయి, వాటిని గౌరవించాలి. కొన్నిసార్లు, మనం కేవలం కుతూహలంతో ప్రశ్నలు అడుగుతాము, కానీ అవతలి వ్యక్తిని తమ వ్యక్తిగత విషయాల్లోకి చొరబడినట్లుగా భావించే అవకాశం ఉంటుంది. ఇది సంబంధాలు చెడిపోయే స్థాయిని పెంచుతుంది. ఎవరినీ అడగకూడని నాలుగు ప్రశ్నలు ఉన్నాయి. ఆ ప్రశ్నలు ఏంటో తెలుసుకుంటే.. ఎవరినీ నొప్పించకుండా ఉండగలం. అవేంటంటే..
జీతం..
ఒకరి ఆదాయం లేదా జీతం గురించి అడగడం చాలా సున్నితమైన ప్రశ్నలలో ఒకటిగా పరిగణించబడుతుంది. చాలా మంది తమ ఆర్థికని గోప్యంగా ఉంచుకోవడానికి ఇష్టపడతారు. ఈ ప్రశ్న ఎదుటి వ్యక్తికి ఏదైనా కలిగించవచ్చు. ఇలాంటి ప్రశ్న వేయడం వల్ల ఇతరులతో తనను పోలుస్తున్నారని లేదా అంచనా వేస్తున్నారని ఎదుటివారికి అనిపించవచ్చు. అందుకే ఎవరి సంపాదన గురించి ఎప్పుడూ అడగకూడదు.
పెళ్ళెప్పుడు..
పెళ్లెప్పుడు అనే ప్రశ్నను భారతీయులు చాలా తరచుగా అడుగుతుంటారు, కానీ ప్రతి వ్యక్తి పరిస్థితులు ఉంటాయి. కొందరు తమ వృత్తిపై దృష్టి పెడుతుండగా, మరికొందరు వ్యక్తిగత కారణాల వల్ల పెళ్లికొనడానికి ఇష్టపడకపోవచ్చు. ఈ ప్రశ్నను పదేపదే అడగడం వల్ల ఎదుటి వ్యక్తిపై అనవసరమైన ఒత్తిడి పడవచ్చు.
వయసు..
వయస్సు అడగడం సాధారణంగా అనిపించింది, చాలా మంది దానిని వ్యక్తిగత సమాచారంగా పరిగణిస్తారు.
ముఖ్యంగా ఉద్యోగం చేసే చోట లేదా మొదటి సారి ఎవరితోనైనా కలిసినప్పుడు ఇలాంటి ప్రశ్న వేస్తే ఎదుటి వారిని ఇబ్బందికి గురిచేస్తుంది. అవసరం ఉంటే తప్ప వయస్సుకు సంబంధించిన ప్రశ్నలు అడగకపోవడమే మంచిది.
పిల్లలు..
భారతదేశంలో పెళ్లైన చాలా మంది మహిళలు ఎదుర్కునే ప్రశ్న ఇంకా పిల్లలు పుట్టలేదు ఎందుకు అని. ఇది చాలా భావోద్వేగ, సున్నితమైన ప్రశ్న. కొంతమందికి వారు మాట్లాడటానికి ఇష్టపడని వ్యక్తిగత నిర్ణయాలు, ఆరోగ్య కారణాలు లేదా కుటుంబ పరిస్థితులు ఉండవచ్చు. అందువల్ల, ఇలాంటి ప్రశ్నలు సంబంధాలలో దూరాన్ని సృష్టించే అవకాశం ఉంటుంది. అందుకే ఏ ఆడపిల్లను ఎవరు ఈ ప్రశ్న అడగకూడదు.
*రూపశ్రీ.

