వేసవి విడుదలలు: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరూ తమ హవాని కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకు ఎవరికి సాధ్యం కాని రీతిలో గొప్ప విజయాలను సాధిస్తున్న మన స్టార్ హీరోలు ఇకమీదట కూడా అదే హవాని చూపించాలనే ప్రయత్నంలో ఉన్నారు. ఇక వాళ్ళకంటూ ఒక సపరేట్ క్రేజ్ ను సంపాదించుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు… ఒక సినిమా చేయడం ఎంత ముఖ్యమో దాన్ని సరైన సమయంలో రిలీజ్ చేయడం కూడా అంతే ముఖ్యం… అయితే సమ్మర్లో స్టూడెంట్స్ అందరికీ హాలీడేస్ ఉంటాయి. కాబట్టి సినిమాలను రిలీజ్ చేస్తే ఎక్కువ మంది చూడడానికి ఆస్కారం ఉంటుంది. కానీ ఈ సమ్మర్ మాత్రం స్టార్ హీరోల సినిమాలు ఏవి ప్రేక్షకులను అలరించలేదు. దానికి తోడుగా అసలు సినిమాలను రిలీజ్ చేయలేదు. జూన్ 4వ తేదీన వస్తున్న ‘పెద్ది’ సినిమాను మినహాయిస్తే మిగిలిన ఏ సినిమా కూడా ఈ సమ్మర్లో అయితే. మరి ఎందుకని ఈ సమ్మర్ ని అలా వృధాగా చేసారు అంటూ కొందరు కొన్ని కామెంట్స్ వదిలేస్తున్నారు.
ఇక ఏది ఏమైనా ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాలేవీ ప్రేక్షకులను అలరించలేదు. ఎందుకని అలాంటి సినిమాలను చేస్తున్నారు. మేకర్స్ కొంచెం శ్రద్ధ పెట్టి మంచి సినిమాలు చేస్తే బాగుంటుంది కదా అనే ధోరణిలో కూడా మరి కొందరు వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
ఇక మొత్తానికైతే ఈ సమ్మర్ ను వృధాగా వదిలేశారు అంటూ ప్రతి ఒక్కరు కామెంట్ చేస్తుండటం విశేషం… ఇకమీదటైనా భారీ విజయాలను సాధించాలంటే సినిమా రిలీజ్ కీలకం కాబట్టి వచ్చే ఏడాది సమ్మర్ వరకు అయినా సరే ఎక్కువ సినిమాలను రిలీజ్ చేసి ప్రేక్షకుల అటెన్షన్ ను వాడుకోవాలని ప్రతి ఒక్కరు చెబుతున్నారు.
ఇక వచ్చే ఏడాది సమ్మర్ కి సందీప్ రెడ్డి వంగ చేసిన స్పిరిట్, రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న వారణాసి సినిమాలైతే రిలీజ్ అవుతున్నాయని అనౌన్స్ చేశారు. ఇక ఇప్పటికే ఆ సినిమా రిలీజ్ డేట్స్ ను అనౌన్స్ చేశారు. కానీ ఈ డేట్స్ ను పోస్ట్ పోన్ చేయకుండా ఉంటే బాగుంటుంది మరి కొంతమంది… ఇక వీటితో పాటుగా సినిమాలు కూడా వచ్చే సమ్మర్ కి రిలీజ్ చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది…

