బజాజ్ చేతక్ 2026 ఎలక్ట్రిక్ స్కూటర్: భారతీయ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల్లో బజాజ్ కంపెనీకి చెందిన చేతక్ మరోసారి తన సత్తా చాటింది. ఈ వాహనం మార్కెట్లోకి వచ్చిన కొత్తలో పెద్దగా ఆదరణ ఉండేది కాదు. ఇదే సమయంలో కొత్తగా ఎలక్ట్రిక్ స్కూటర్లు మార్కెట్లోకి రావడంతో పోటీని తట్టుకోలేకపోయింది. అయితే ఈ ఏడాదిలో ఈ స్కూటర్‌కు ఎక్కువ ఆదరణ పెరిగింది. దీంతో ఒక్క ఏడాదిలోనే 79 శాతం వృద్ధి అమ్మకాలను నమోదు చేసుకుంది. ఇంతకీ ఈ స్కూటర్ అమ్మకాలు ఎలా ఉన్నాయి? ఇందులో ఉండే ఫీచర్లు ఏంటి?
బజాజ్ చేతక్ 2026 ఏప్రిల్ నెలలో 34,304 యూనిట్ల విక్రయాలను నమోదు చేసుకుంది. ఎలక్ట్రిక్ స్కూటర్ అత్యంత ప్రజాదరణ పొందిన మోడల్లో ఇది కూడా ఒకటిగా నిలిచింది. గత ఏడాది ఇదే కాలంలో 19,216 యూనిట్లు మాత్రమే విక్రయాలు చేసుకున్న ఈ స్కూటర్ ఈసారి దాదాపు 79 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేయడం విశేషం. ఎలక్ట్రిక్ వాహనాల పట్టీ కొత్త కొత్త కంపెనీలు, మోడళ్లు మార్కెట్లోకి వస్తున్నప్పటికీ చేతక్‌పై వినియోగదారుల నమ్మకం మరింత పెరుగుతోంది. ముఖ్యంగా, నాణ్యత విశ్వసనీయత, బ్రాండ్ విలువ, విస్తృత సర్వీస్ నెట్వర్క్ వంటి అంశాలు చేతక్ అమ్మకాలకు ప్రధాన బలంగా మారాయి. నగరాల్లో రోజువారీ ప్రయాణాలకు తక్కువ నిర్వహణ ఖర్చుతో కూడిన వాహనం కోసం చూస్తున్న వారికి ఇది ఆకర్షణీయమైన ఎంపికగా నిలుస్తోంది.
బజాజ్ చేతక్‌లో అత్యాధునిక లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్‌ను అమర్చారు. ఈ స్కూటర్లో 2.9 kWh, 3.2 kWh అనే సామర్థ్యాలు కలిగిన బ్యాటరీలు అందుబాటులో ఉన్నాయి. ఈ బ్యాటరీలు ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే సుమారు 113 కి.ల నుండి 127 వరకు ఉండే అవకాశం ఉంది. ప్రతిరోజూ కార్యాలయాలకు, విద్యాసంస్థలకు లేదా నగర పరిధిలో వారికి ఇది ఎంతో అనుకూలంగా మారింది. ఎలక్ట్రిక్ మోటార్‌తో పనిచేసే చేతక్ రోడ్లపై అత్యంత నిశ్శబ్దంగా ఉండే అనుభూతిని అందిస్తుంది. పెట్రోల్ వాహనాలతో వచ్చే శబ్దం తక్కువగా ఉండటంతో పాటు కంపనాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. ట్రాఫిక్ ఎక్కువగా ఉండే నగర ప్రాంతాల్లో ఈ లక్షణం ఆకట్టుకుంటోంది.
బజాజ్ చేతక్ ప్రీమియం స్కూటర్ లో 5 TFT కలర్ డిస్ప్లే లేదా టచ్‌స్క్రీన్ ఉంటుంది. బేసిక్ వేరియంట్లలో ఎల్సిడి స్క్రీన్ వస్తుంది. బ్లూటూత్ ద్వారా స్కూటర్‌ను చేతక్నకు కనెక్ట్ చేసుకోవచ్చు. దీని ద్వారా కాల్స్, మెసేజ్ అలర్ట్‌లు, నావిగేషన్ మరియు మ్యూజిక్ కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ స్కూటర్లలో ఎకో , స్పోర్ట్ వంటి రైడింగ్ మోడ్స్ ఉంటాయి. బ్యాటరీ అమరికను బట్టి 25 నుంచి 35 లీటర్ల వరకు విశాలమైన బూట్ అందుబాటులో ఉంది.
ప్రస్తుతం పెరుగుతున్న పెట్రోల్ ధరలు. చేతక్‌ను ఛార్జ్ చేయడానికి అయ్యే ఖర్చు, పెట్రోల్ స్కూటర్‌తో చాలా తక్కువ. అలాగే ఇంజన్ ఆయిల్ మార్పులు, క్లచ్ లేదా గేర్‌బాక్స్ నిర్వహణ వంటి అదనపు ఖర్చులు లేకపోవడం దీని ప్రత్యేకత.

