టీవీఎస్ జూపిటర్ స్కూటర్ ఫీచర్లు: భారత ద్విచక్ర వాహనంలో కుటుంబ సభ్యుల నమ్మకాన్ని గెలుచుకున్న స్కూటర్లలో TVS Jupiter ఒకటి. మంచి రైడింగ్, మంచి మైలేజ్, తక్కువ నిర్వహణ ఖర్చులు, ఆధునిక ఫీచర్లతో ఈ స్కూటర్ దేశవ్యాప్తంగా విశేష ఆదరణ పొందుతోంది. ముఖ్యంగా రోజువారీ ప్రయాణాలు చేసే ఉద్యోగులు, విద్యార్థులు, కుటుంబాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించబడిన ఈ మోడల్లో తన ప్రత్యేక ప్రయోజనాలను నిలబెట్టుకుంది. ఇందులో భాగంగా గత నెలలో ఈ స్కూటర్ అమ్మకాల్లో వృద్ధి శాతం 27.83. వీటిపై పూర్తి వివరాల్లోకి వెళితే..
2026 మే నెలలో టీవీఎస్ జూపిటర్ మొత్తం 1,24,767 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. గత ఏడాది ఇదే నెలలో 97,606 యూనిట్లు మాత్రమే విక్రయించబడ్డాయి, ఈసారి అదనంగా 27,161 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఈ ఏడాది వ్యవధిలో 27.83 శాతం వృద్ధిని నమోదు చేసి కంపెనీకి మరోసారి బలమైన ఫలితాలను అందించింది. స్కూటర్ కొనుగోలు చేసేవారిలో చాలా మంది ఇంధన పొదుపు, సౌకర్యవంతమైన ప్రయాణం, విశ్వసనీయతకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ అంశాల్లో టీవీఎస్ జూపిటర్ మంచి పనితీరు కనబరుస్తుంది. నగర ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ స్కూటర్కు మంచి డిమాండ్ ఏర్పడింది.
జూపిటర్ విజయానికి అనేక కారణాలు ఉన్నాయి. ఆధునిక డిజైన్, మెరుగైన ఇంజన్ పనితీరు, విశాలమైన సీటింగ్ సౌకర్యం, అధిక స్టోరేజ్, స్మార్ట్ ఫీచర్లు కొనుగోలును ఆకర్షిస్తున్నాయి. ఇందులో 113.3cc సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ఉంది. ఇది 7.91 bhp పవర్, 9.8 Nm టార్క్ ను అందిస్తుంది. ఇందులో బ్లూటూత్ ద్వారా మీ స్మార్ట్ఫోన్ను కనెక్ట్ చేసుకోవచ్చు. టర్న్ బై టర్న్ నావిగేషన్, కాల్/మెసేజ్ అలర్ట్లు, వాయిస్ అసిస్టెన్స్లో ఉన్నాయి. అలాగే కంపెనీ దేశవ్యాప్తంగా విస్తరించిన డీలర్ నెట్వర్క్, సమర్థవంతమైన సర్వీస్ సౌకర్యాలు కూడా అమ్మకాల పెరుగుదలకు దోహదపడుతున్నాయి.
స్కూటర్ తీవ్రమైన పోటీ టీవీఎస్ జూపిటర్ తన స్థిరమైన పనితీరుతో మార్కెట్లో బలమైన ప్రదర్శన కొనసాగుతోంది. కొత్త మోడళ్ల ప్రవేశం, ఎలక్ట్రిక్ వాహనాల పెరుగుతున్న ప్రభావం మధ్య కూడా ఈ స్కూటర్ అమ్మకాలు పెరగడం విశేషం. ఇది బ్రాండ్ పై విశ్వాసాన్ని ప్రతిబింబిస్తోందని మార్కెట్ నిపుణులు గుర్తించారు. ఈ స్కూటర్ ధర సుమారు రూ. 91,738 నుంచి ప్రారంభం అవుతుంది. మే నెలలో నమోదైన ఈ విక్రయాలు TVS మోటార్ కంపెనీకి పెద్ద ఊరటనిచ్చాయి. జూపిటర్ అమ్మకాల వృద్ధి కంపెనీ మొత్తం స్కూటర్ విభాగ పనితీరును బలోపేతం చేయడంతో పాటు మార్కెట్ వాటాను మరింత పెంచే అవకాశాలను కల్పిస్తోంది.

