కలెక్టర్ గారు మీరే తీసుకుని గోశాలకు అప్పగించండి
ఓ వృద్ధ రైతు వేడుకోలు
విశాలాంధ్ర రైల్వేకోడూరు: ఈ పశువులను పోషించలేను….మీరే తీసుకోండి అంటూ ఓ వృద్ధ రైతు తన ఆవేదనను మీడియా ముందు ఆవేదన చెందడం అందరినీ కలిచివేసింది. నియోజకవర్గం పరిధిలోని ఓబులవారిపల్లి వారు కొర్లకుంట చలంపాలెం మధ్యలో చిత్తూరు జిల్లా కానిపాకం కు చెందిన విజయ్ కుమార్ (70)అనే వ్యక్తి పద్మావతి అనే పేరుతో గోశాలను నడుపుతున్నారు.గత 26 సంవత్సరాలుగా గోశాలను నడుపుతున్నారు. వయోభారంతో అనారోగ్యంతో వృద్దాప్యంలో 126 ఆవులను,లేగ దూడలను సంరక్షించలేక పోతున్నానని శుక్రవారం పాత్రికేయుల ఎదుట వాపోయాడు.గోవులను పోషించడం ఇష్టం వల్ల నాడు పద్మావతి గోశాలను ఏర్పాటు చేసి గోవులను పోషించుకున్నాను.ప్రస్తుతం వయోభారంతో గోశాలను నడపాలని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని 126 గోశాలను, లేగదూడలను ఆ నవీన టిటిడి గోశాలకు తరలించి న్యాయం చేయాలని విజయ్ కుమార్ సూచించారు.
పోస్ట్ ఈ 126 పశువులను పోషించలేను మొదట కనిపించింది విశాలాంధ్ర.

