గత నెల ద్రవ్య సమీక్షలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచినా.. కొన్ని ప్రధాన ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు.. తమ ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీ)పై ఆకర్షణీయమైన వడ్డీరేట్లను కొనసాగిస్తున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్), బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) సహా, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంకులు ఈ జాబితాలో ఉండగా.. దీనివల్ల జనరల్ డిపాజిటర్లు, సీనియర్ సిటిజన్లను ఆకర్షిస్తున్నాయి. ఆ వివరాల్లోకి వెళ్తే..
- ఎస్బీఐ: సాధారణ పౌరులు అమృత్ వృష్ఠి సహా ఆయా కాలపరిమితుల ఎఫ్డీలపై కనిష్ఠంగా 3.05 శాతం,
గరిష్ఠంగా 6.45 శాతం వడ్డీని అందుకోవచ్చు. వృద్ధులు 3.55 శాతం నుంచి 6.90 శాతం వరకు పొందవచ్చు. - హెచ్డీఎఫ్సీ: 3 ఏండ్ల ఒకరోజు నుంచి 4 ఏండ్ల 7 నెలల్లోపున్న ఎఫ్డీలపై సాధారణ డిపాజిటర్లకు 2.75 శాతం నుంచి 6.50 శాతం వడ్డీరేటు లభిస్తోంది.అదే సీనియర్ సిటిజన్లకు 3.25 శాతం నుంచి 7 శాతం వరకు ఉంది.
- ఐసీఐసీఐ: 3 ఏండ్ల ఒకరోజు నుంచి 5 ఏండ్లదాకా కాలపరిమితి ఎఫ్డీలపై ఈ బ్యాంక్‌లో జనరల్ సిటిజన్స్‌కు 2.75-6.50 శాతం మధ్య వడ్డీరేటున్నది. సీనియర్ సిటిజన్లకు 3.25-7.1 శాతం వడ్డీ లభిస్తుంది.
- పీఎన్బీ: జనరల్ సిటిజన్లకు 3 శాతం నుంచి 6.60 శాతం వడ్డీ ఉన్నది. సీనియర్ సిటిజన్లకు 3.50 శాతంనుంచి 7.10 శాతం వడ్డీ లభిస్తుంది. 444 రోజుల కాలపరిమితి కలిగిన ఎఫ్డీపై ఆకర్షణీయమైన వడ్డీరేట్లు అందుబాటులో ఉన్నాయి.
- బీవోబీ: బీవోబీ స్కేర్ డ్రైవ్ డిపాజిట్ స్కీమ్ సహా ఆయా ఎఫ్డీలపై సాధారణ పౌరులకు 3.50 శాతం నుంచి 6.45 శాతం వరకు బ్యాంక్ వడ్డీని చెల్లిస్తున్నది. సీనియర్ సిటిజన్లకు 4 శాతం నుంచి 6.95 శాతం వడ్డీ ఉన్నది. 444 రోజుల ఎఫ్డీపై గరిష్ఠ వడ్డీని అందుకోవచ్చు.

