మన తెలంగాణ/హైదరాబాద్: ఊర్ల నుంచి మహానగరాల వైపు సాగుతున్న యువత ప్రయాణం ఇప్పుడు బతుకుదెరువు కోసమే కాదు స్వయం ఉపాధి కోసం కూడా. హాస్టళ్లు కిక్కిరిసిపోవడానికి, గల్లీ గల్లీల్లో వాహనాలు పరుగులు తీయడానికి కారణం…డిజిటైలేజేషన్ సృష్టించిన కొత్త ఉపాధి మా ర్గాలు.. ఏ ఒక్కరినీ నిరుద్యోగిగా ఉండనివ్వడం లేదు. ఒకప్పుడు ఉద్యోగం అంటే ఉదయం తొమ్మిదికి వెళ్లి సాయంత్రం ఐదు గంటల వరకు నాలుగు గోడల మధ్య చేసే పని. కానీ, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. డిజిటలైజేషన్ పుణ్యమా అని గిగ్ ఎకానమీ అనే కొత్త ఉద్యోగ సంస్కృతి రాష్ట్ర రాజధానులను ఊపేస్తోంది. డిగ్రీలు, పీజీలు ఉన్నవారే కాదు, ఏ ప ని వచ్చినా సరే.. కష్టపడి బతకాలంటే తపన ఉన్న ప్రతి ఒక్కరికీ హైదరాబాద్ , చైన్నై, ముంబై, బెంగళూర్ వంటి నగరాలు ఉపాధి కల్పిస్తున్నాయి.
ఓలా, ఉబెర్, స్విగ్గీ, జొమాటో వంటి సంస్థలు వేల సంఖ్యలో యువతకు జీవనోపాధిని కల్పిస్తున్నా యి. నగరాల్లో ఎక్కడ చూసినా బైకులపై పరుగులు తీ స్తున్న యువత.. నేటి గిగ్ ఎకానమీకి నిలువుటద్దాలు. ప్రదర్శన పురోగతి కూడా ఈ మార్పునకు కారణంగా చెప్పవచ్చు. మా ర్కెట్లు, రైతు బజార్లకే పరిమితమైన కూరగాయల దుకాణాలు.. అద్దాలు, ఏసీల భవంతుల్లోకి విస్తరించిన విధంగా నూతన వ్యాపార, ఉపాధి మార్గాలు వెల్లువెత్తాయి. సంక్రాం తి పండుగకు గడప ముగ్గులు వేస్తాం అనేవారు ఉన్నారంటే నే అర్థం చేసుకోవచ్చు. ముగ్గులు వేసే కొలువులు కూ డా వ చ్చాయని. చంటిపిల్లల బాగోగులు చూసుకోవడం, మంచానికి పరిమితమైన వృద్ధులకు సకల సౌకర్యాలు కల్పించే కొలువులకు రూ.20 వేల నుంచి మొదలుకొని జీతాలు ఇస్తున్నా రు. ఇందుకు చదువు, వయసు,ఆడ,మగతో సంబంధం లేదు. నమ్మకంగా పనిచేస్తే చాలు కళ్లకు అద్దుకుంటున్నారు యజమానులు.
మహిళల ప్రస్థానం.. ఆర్థిక స్వతంత్రం
ఈ మార్పులో మహిళల పాత్ర ప్రశంసనీయం. వంట పని నుంచి గృహ సేవలు, ఇతర సేవా రంగాల వరకు మహిళలు తమకంటూ ఒక గుర్తింపును తెచ్చుకుంటున్నారు. నాలుగైదు ఇళ్లలో పని చేస్తూనే, గౌరవప్రదమైన ఆదాయాన్ని పొందుతూ, కుటుంబాలకు ఆర్థిక భరోసాగా నిలుస్తున్నారు. శ్రమను నమ్ముకుంటే చాలు, ఏ రంగంలోనైనా రాణించవచ్చని వారు నిరూపిస్తున్నారు. మహానగరాల్లో పనివారుకున్న డిమాండ్ ఎలాంటిదో అక్కడ ఉన్న వారికి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఊర్ల నుంచి నగరాలకు వచ్చి నెలకు 20 నుంచి 30 వేల వరకు సునాయసంగా సంపాదిస్తున్నారు. వంటల్లో రాణించినవారిని యజమానులు నెత్తినపెట్టుకుని మరీ చూసుకుంటారు. భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేసుకునే కుటుంబాలలో వారి అవసరం ఇంకా ఎక్కువ. పండుగల సమయాల్లో పిండివంటలు కూడా బయట చేయించుకోవడం, దుకాణాల్లో కొనుగోలు చేయడం సర్వసాధారణంగా మారింది. అవి తయారుచేసేవారి సిబ్బందిలోనూ మహిళలే అధికులు.
నగరాల్లోనే ఎందుకు?
హైదరాబాద్, ముంబై, చెన్నై వంటి నగరాలు ఇప్పుడు స్థానాలు. ఒకప్పుడు గ్రామాల నుంచి నగరాలకు వలస వెళ్లడం అంటే భయం. ఇప్పుడు అదే వలసలు ఉపాధి మార్గాలుగా మారాయి. రోజుకు కనీసం వెయ్యి రూపాయలకు తక్కువ కాకుండా సంపాదిస్తూ, సగటు యువకుడు ఆర్థికంగా స్థిరపడుతున్నాడు. మరీ ముఖ్యంగా కొన్ని యువతకు హాస్టళ్లలో ఆనందిస్తూ ఉద్యోగాలు కల్పిస్తున్నాయి. ద్విచక్రవాహనం నడిపితే చాలు.. వాహనం కూడా సదరు సంస్థలే సమకూరుస్తూ కొలువులు కల్పిస్తున్నాయి. ఛార్జింగ్ వాహనాలు వినియోగిస్తున్నారు కనుక డ్రైవింగ్ లైసెన్స్ కూడా అవసరం లేదు. స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు డిగ్రీలు ఉన్నా లేకున్నా పనిచేసుకోవచ్చు.
2030 నాటికి గిగ్ వర్కర్లు సంఖ్య 2.35 కోట్లకు అవకాశం
హైదరాబాద్, ముంబై, చెన్నై వంటి నగరాలు ఇప్పుడు ఉపాధి అవకాశాలు. ఆహార పంపిణీ, వ్యక్తులను గమ్యాలకు చేర్చడం, ఈ కామర్స్ డెలీవరీ రంగాల్లో గిగ్ ఉద్యోగులు అధికంగా పనిచేస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా 4.5 లక్షల మంది గిగ్ వర్కర్లుగా పనిచేస్తున్నట్లు సమాచారం. వారిలో 4 లక్షల మంది హైదరాబాద్లోనే కొలువులు చేస్తున్నారు. వారిలో 64 శాతం మంది 26 నుంచి 35 ఏళ్ల మధ్య వయసుగల యువకులు. ఇందులో 91 శాతం మంది పురుషులే ఉన్నారు. ఈ యేడాది ఫిబ్రవరిలో జరిగిన ఆలిండియా గిగ్ వర్కర్ల సమ్మెలో తెలంగాణ నుంచి లక్ష మంది ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 2026లో తెలంగాణ ప్లాట్ఫామ్ బేస్డ్ గిగ్ వర్కర్స్ వెల్ఫేర్ బిల్లును ప్రవేశపెట్టింది. దీని ద్వారా బీమా, పింఛన్, ఇతర సామాజిక భద్రత ప్రయోజనాలు కల్పించే ప్రయత్నం జరుగుతోంది.
మహారాష్ట్రలోని 5 లక్షల వరకు ఉన్న గిగ్ వర్కర్ల కోసం ప్రత్యేక సామాజిక భద్రత చట్టాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం రూపొందిస్తోంది. తమిళనాడులో 3 నుంచి 4 లక్షల మంది గిగ్ వర్కర్లు ఉన్నట్లు అంచనా. చెన్నై, కోయంబత్తూర్, మధురై, తిరుచిరాపల్లి వంటి ప్రధాన నగరాల్లో వీరు అత్యధికంగా కేంద్రీకృతమై ఉన్నారు. చెన్నై లోనే సగానికిపైగా వర్కర్లు పనిచేస్తున్నారు. ఐటి రంగంలో అగ్రగామిగా ఉన్న బెంగళూరులో ఆహార పంపిణీ, క్విక్ కామర్స్ రంగాలు వేగంగా విస్తరించాయి. దీనివల్ల డెలవరీ పార్లనర్లు, క్యాబ్ డ్రైవర్లు తో పాటు గ్రిగ్ వర్కర్లు 2 నుంచి 2.5 లక్షల వరకు ఉంటారని తెలుస్తుంది. దేశంలో గిగ్ వర్కర్ల సంఖ్య 2025 నాటికి 1.2 కోట్లకు చేరుతుందని, ఇది 2030 నాటికి 2.35 కోట్లకు చేరుతుందని నివేదికలు అంచనా వేస్తున్నాయి.
ప్రభుత్వాల బాధ్యత.. – యువత అడుగులు
గిగ్ ఎకానమీ భవిష్యత్తు ఉపాధి మార్గాల్లో ఒకటని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వాలు మౌలిక సదుపాయాలను పెంచి, యువతకు సరైన శిక్షణ, సామాజిక భద్రత కల్పిస్తే.. దేశ పురోగతికి వీరే వెన్నెముక అవుతారు. కష్టపడే తత్వం, ఆధునిక సాంకేతికత జతకలిస్తే.. నిరుద్యోగ సమస్య అన్న మాటే ఉండదు. నేడు ఏ రంగంలో చూసినా యువత జంకు, బొంకు లేకుండా పనిచేస్తోంది. వారు వెతుక్కుంటున్నది ఉపాధినే కాదు.. తమ భవిష్యత్తును కూడా. వారి శ్రమకు తగిన భద్రత కల్పించడం ఇప్పుడు ప్రభుత్వాలకు ముందున్న ప్రధాన లక్షం.

