హైదరాబాద్: ఐపీఎల్ 19 లీగ్ దశలో శుక్రవారం (మే 22) హైదరాబాద్‌లోని ఉప్పల్ హైదరాబాద్‌లో సన్ రైజర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ చూసేందుకు స్టేడియానికి వెళ్లే ప్రేక్షకులకు మల్కాజిగిరి సీపీ సుమతి కీలక సూచనలు చేశారు. ఎస్ఆర్హెచ్, ఆర్సీబీ మ్యాచ్‌కు వచ్చే ప్రేక్షకులు నిర్ణీత సమయానికి (గంట ముందే) స్టేడియంకి చేరుకుని వారికి కేటాయించిన సీట్లలో కూర్చోవాలని చెప్పారు.
బుకింగ్ ప్లాట్‌ఫామ్ జొమాటో డిస్ట్రిక్ట్ యాప్‌లో మీ గేటుకు సంబంధించిన గూగుల్ మ్యాప్ ఉపయోగించుకోనీ మీ సీట్ నంబర్‌ను దగ్గరికి చేరుకోవచ్చని తెలిపింది. ప్రతి ఒక్కరూ సైన్యాన్ని ఫాలో అవ్వాలని సూచించారు. సైన్ బోర్డ్‌పై ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీ గేటును గూగుల్ మ్యాప్ ద్వారా సులభంగా చేరుకోవచ్చు.
►ఇంకా చదవండి | మ్యాచ్ మధ్యలో వికెట్ కీపర్ సంజూ శాంసన్‌కు తీవ్ర గాయం
కొన్ని ఫేక్ వెబ్సైట్ల సెల్ టికెట్ల కోసం పోలీసుల దృష్టికి వచ్చిందని.. వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలని అప్రమత్తం చేశారు. అత్యవసర సమయంలో ఎమర్జెన్సీ ఎగ్జిట్ మ్యాప్ స్టేడియంలో ప్రదర్శించడం జరిగింది.. ఎమర్జెన్సీ సమయంలో డయల్ 100 ని ఉపయోగించాలని సూచించారు.

