విశాలాంధ్ర బొమ్మనహాల్ :- ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకు జీవనాడిగా నిలిచిన తుంగభద్ర జలశయానికి వివిధ ప్రాంతాల నుంచి వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది. శివమొగ్గ, తీర్థహళ్లి, చిక్కమగళూరు, వరనాడు, శృంగేరి తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో జలాశయానికి ఇన్ఫ్లో పెరుగుతోందని తుంగభద్ర బోర్డు అధికారులు తెలిపారు.ప్రస్తుతం తుంగభద్ర జలశయం 28 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జలాశయం పూర్తి నీటిమట్టం 1633 అడుగులు కాగా, ప్రస్తుతం 1604.55 అడుగులకు నీటిమట్టం చేరింది. పూర్తి నిల్వ సామర్థ్యం 105.788 టీకాలు కాగా, ప్రస్తుతం 28 టీకాలు నీరు నిల్వ అధికారులు.ప్రస్తుతం జలశయానికి 21,089 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా, 8,035 క్యూసెక్కుల అవుట్ఫ్లోగత ఏడాది ఇదే తేదీతో పోలిస్తే పరిస్థితి ఉంది. అప్పట్లో జలశయంలో 1625.64 అడుగులు నీటిమట్తో 78.60 టీఎంసీల నీరు నిల్వ ఉండేది. ఆ సమయంలో 29,546 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా, 38,557 క్యూసెక్కుల నీటి గేట్ల దిగువకు విడుదల చేశారు.ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో తుంగభద్ర జలశయానికి వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

