ఎన్టీఆర్‌కి భారతరత్న: తెలుగుదేశం పార్టీ వార్షిక పండుగ మహానాడులో ఈసారి కూడా ఒక సంప్రదాయం పునరావృతమైంది. తెలుగుజాతి గర్వకారణం, మహానటుడు ఎన్టీఆర్‌కు భారతరత్న ప్రకటించాలంటూ ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ కేవలం ఒక నాయకుడు మాత్రమే కాదని, తెలుగువారి ఆత్మగౌరవానికి నిలువెత్తు రూపమని కొనియాడారు. లోకేష్ ప్రతిపాదించిన 3 శాతం మహిళా రిజర్వేషన్లను పార్టీలో అమలు చేద్దామనే ఆయన ఇచ్చిన పిలుపు కార్యకర్తల్లో ఉత్సాహం నింపింది, అందరి దృష్టిలో భారతరత్న తీర్మానం పైనే ఉంది.
దశాబ్దాల డిమాండ్ – అందని గౌరవం
ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ నిన్న మొన్నటిది కాదు. గత మూడు దశాబ్దాలుగా ప్రతి మహానాడులోనూ టీడీపీ ఈ తీర్మానం చేస్తూనే ఉంది. గతంలో చంద్రబాబు యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వానికి కీలకంగా వ్యవహరించారు ఎన్టీఆర్‌కు భారతరత్న ఇప్పించలేకపోయారు. వాజ్‌పేయి హయాంలో ఎన్డీయే ప్రభుత్వానికి కింగ్ మేకర్‌గా ఉన్నప్పుడు కూడా గౌరవం ఎన్టీఆర్‌కు దక్కలేదు. రాజకీయ కారణాల వల్ల ఈ ప్రక్రియ వాయిదా పడుతూ వచ్చింది.
కింగ్ మేకర్‌గా బాబు – ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు?
ప్రస్తుత కేంద్రాన్ని మోదీ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు అత్యంత కీలకం. టీడీపీ మద్దతు లేకుండా కేంద్ర ప్రభుత్వం మనగడ సాగడం అసాధ్యం. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్టీఆర్‌కు భారతరత్న ఇప్పించుకోవడం చంద్రబాబుకు పెద్ద కష్టమైన పని కాదు. ఈ పని పూర్తి చేయాలి. ఈసారి కేవలం తీర్మానానికే పరిమితం కాకుండా, కేంద్రంపై ఒత్తిడి తెచ్చి భారతరత్న సాధించాలని ప్రయత్నిస్తున్నారు.
ఇది మనందరి ఆకాంక్ష, ప్రతీ తెలుగువారి కోరిక…
తెలుగు ప్రజల మనోభావాలను గుర్తించి ఎన్టీఆర్‌కు భారత రత్న ప్రకటించాలని మహానాడు ఏకగ్రీవంగా తీర్మానిస్తోంది. దేశరాజకీయాల్లో పెనుమార్పులకు నాంది పలికిన మహోన్నత నాయకుడికి భారతరత్న అందించాలనుకుంటున్నాను. #మహానాడు2026#NTRLivesOn… pic.twitter.com/LNxr7zTh7w
— తెలుగుదేశం పార్టీ (@JaiTDP) మే 28, 2026
మహిళా రిజర్వేషన్లు – ఒక ముందడుగు
మహానాడు రెండో రోజున చంద్రబాబు చేసిన మరో కీలక ప్రకటన మహిళా రిజర్వేషన్లు. లోకేష్ ప్రతిపాదించిన 33 శాతం కోటాను పార్టీ పదవులలోనూ, 2029 అసెంబ్లీ టికెట్ల కేటాయింపులోనూ అమలు చేస్తామన్న ప్రకటన సాహసోపేతమైనదే. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు కావడానికి ముందే, టీడీపీ మహిళా దీన్ని ఆచరణలో చూపుతుందని చెప్పడం ద్వారా ఓటు బ్యాంకును ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఇది ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా ఉందని చంద్రబాబు అభివర్ణించారు.
అభిమానుల ఆకాంక్షలు, రాజకీయ అవసరాలు ఎలా ఉన్నా.. ఎన్టీఆర్ ఖ్యాతి భారతరత్న అవార్డుకు అతీతమైనది. కానీ, ఒక రాజకీయ పార్టీగా టీడీపీ తన వ్యవస్థాపకుడికి అత్యున్నత గౌరవాన్ని ఇప్పించడం అనేది వారి నైతిక బాధ్యత. ఈసారి వారికి ఉన్న పలుకుబడిని ఉపయోగించి ఎన్టీఆర్ జయంతి నాటికైనా ఆ ప్రకటన వచ్చేలా చంద్రబాబు కృషి చేస్తారా లేదా అన్నది వేచి చూడాలి. తీర్మానాలు చేయడం కంటే, ఫలితాలు సాధించడంపైనే క్యాడర్ ఆశలు పెట్టుకుంది.
ఇంకా చదవండి

