విశాలాంధ్ర -ధర్మవరం ; ఎఫ్ ఎన్ శిక్షణ కార్యక్రమంలో భాగంగా ధర్మవరం డివిజన్లోని సుందరయ్య నగర్లోని గల శ్రీ గణేష్ మున్సిపల్ హైస్కూల్లో జరుగుతున్నటువంటి ఎఫ్ఎల్ శిక్షణను డీఈవో కిష్టప్ప సందర్శించారు. ఈ సందర్శనలో భాగంగా నిర్దేశించిన లక్ష్యాలు గూర్చి మాట్లాడుతూ2026- 27 విద్యా సంవత్సరానికి ఖచ్చితంగా విద్యార్థులు సాధించే విధంగా ఉపాధ్యాయుల సామర్థ్యాలు పెంపొందించుకొని, పాఠశాల స్థాయిలో సాధించాలని తెలిపారు. ఉపాధ్యాయులకు ఇచ్చే ఈ శిక్షణ తప్పనిసరిగా పాఠశాలల్లో అమలు చేసి తీరాలని తెలిపారు. నిర్లక్ష్యం వహించకుండా విద్యార్థుల ఉన్నత స్థాయి, మంచి విద్యా బోధనకు ప్రతి ఉపాధ్యాయుడు కృషి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కోస్ట్ డైరెక్టర్ పి రాజేశ్వరి దేవి , ఎంఈఓ 2 గోపాల్ నాయక్, సెంటర్ ఇన్చార్జ్ ఫణిరాజ్ శర్మ , కేఆర్ పి జయరామిరెడ్డి, డిఆర్పీలు కొనసాగుతున్నాయి.

