- కాంగో, ఉగాండా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు వైద్య పరీక్షలు చేసేలా చర్యలు
- విశాఖ, తిరుపతి, విజయవాడ ఇంటర్నేషనల్ విమానాశ్రయాలపై ప్రత్యేక దృష్టి
- అన్ని జిల్లాలకు ప్రత్యేక ఆదేశాలు
- రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడి..
ఆఫ్రికా ఖండంలోని పలు దేశాల్లో ఎబోలా వైరస్ విస్తృతంగా, కేసులు, మరణాల నమోదు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గుర్తించారు. ముఖ్యయోగా కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్ దేశాల్లో ‘ఏబోలా’ వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ జారీచేసిన హెచ్చరికలు, కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వాలకు వస్తున్న ప్రత్యేక మార్గదర్శకాలు, సలహాలు, సూచనల ఆధారంగా ‘ఎబోలా’ వైరస్ వ్యాప్తి, కేసులను సమర్థంగా ఎదుర్కొనేందుకు వైద్య, ఆరోగ్య శాఖ సిద్దంగా ఉందని మంత్రి తెలిపారు.
ఆఫ్రికాలోని కాగో, ఉగాండా దేశాల్లో ఎల తీవ్రత రోజురోజుకీ పెరుగుతోంది. ఈ తరహా దేశాల నుంచి వైజాగ్, తిరుపతి, విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుల ద్వారా వచ్చే ప్రయాణికులు, టూరిస్టుల (ట్రావెల్ హిస్టరీ ఆధారంగా) వైరస్ నిర్ధారణ పరీక్షలు చేసే విషయంలో ఎయిర్ పోర్ట్ అథార్టీ, జిల్లాల వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి నేడొక ప్రకటనలో తెలిపారు. వైరస్ కలిగిన వారిని వెంటనే క్వారంటైన్ చేసి, పక్కనున్న వారికి కూడా వెంటనే వైద్య పరీక్షలు జరిగాయి.
విశాఖ ఓడరేవు అధికారులతో కూడా మాట్లాడి, ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా అధికార యంత్రాంగాన్ని ఆదేశించామని చెప్పారు. విమానాల ద్వారా కాకుండా రోడ్డు మార్గాల ద్వారా వచ్చే వారి విషయంలోనూ అవసరమైన చర్యలు ఉంటాయి. ఎబోలా వైరస్ పీడిత దేశాల నుంచి దేశంలోని వచ్చే ప్రయాణికుల వివరాలను కేంద్ర ప్రభుత్వం నిశితంగా గమనిస్తోందని, దీనికి అనుగుణంగా అవసరమైన వారి రాష్ట్రాలకు పంపుతోందని తెలిపారు. కోవిడ్ హయాంనాటి అనుభవాలు దృష్టిలో పెట్టుకుని ‘ఏబోలా’ విషయంలో ముందస్తు జాగ్రత్తలు, అత్యవసర పరిస్థితులు తలెత్తితే తీసుకోవాల్సిన చర్యలపై ‘యాక్షన్ ప్లాన్’ సిద్ధం చేస్తున్నామని చెప్పారు. వైద్య ఆరోగ్య శాఖలో ANM, ఆశ వర్కర్ల నుంచి స్థాయి నుచి అందర్నీ ‘వర్చువల్’ సమావేశాల ద్వారా అప్రమత్తం చేస్తామని చెప్పారు.
అంతర్జాతీయ విమానాశ్రయాల నగరాల్లోని టీచింగ్ ఆసుపత్రుల్లో ప్రత్యేకంగా ఏర్పాటుచేసే ‘ఐసోలేషన్’ వార్డుల్లో 15 పడకల చొప్పున ఏర్పాటు చేశారు. కేంద్రం నుంచి వస్తున్న జిల్లాలకు పంపుతూ అందర్నీ అప్రమత్తం చేస్తున్నాం. పీపీఈ , వైరస్ నిర్ధారణ పరీక్షల కిట్లు తక్షణ అవసరాలకు సరిపడా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం జారీచేసిన అడ్వయిజరీ మేరకు ప్రజలు అత్యవసరమైతే తప్ప, కాంగో, ఉగాండా, దక్షిణ సుడాన్ దేశాలకు సరఫరా చేయొద్దని మంత్రి శ్రీ సత్యకుమార్ విజ్ఞప్తి చేశారు. గత మూడు వారాల కిందట ఎబోలో ప్రభావిత దేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వారు అనారోగ్యంగా ఉంటే జిల్లా అధికారులకు అందించిన మంత్రి ప్రజలకు సూచించారు. దీనివల్ల అవసరమైన చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు.
ఎబోలా (బండిబుగ్యో) వైరస్ కేవలం వారాల వ్యవధిలోనే మూడు దేశాల్లో అనేకమందికి సోకింది. భౌగోళికంగా కూడా ఈ వ్యాధి వ్యాపించిన ప్రదేశంలో కట్టడి చేయడం కష్టం. వైరస్ సోకిన వారికి కొన్నివారాలపాటు లక్షణాలు బయటపడవు. దీనివల్ల ఎక్కువ మందికి తక్కువ వ్యవధిలో సోకే అవకాశం ఉంది. సాధారణ జ్వరం, అకస్మాత్తుగా జ్వరం పెరగడం, శరీరం మొత్తం బలహీనంగా అనిపించడం, తీవ్ర తలనొప్పి, గొంతునొప్పి, కండరాల నొప్పులు, రోజురోజుకి నొప్పులు తీవ్రమవుతుండటం, వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి, కళ్లల్లో ఎర్రబారడం, ఆకలి తగ్గడం వంటి లక్షణాలు ఎబోలా వైరస్ బారిన పడిన వారిలో కనిపిస్తున్నాయి.

