ఆంధ్రప్రదేశ్:ప్రజాప్రతినిధుల పట్ల అభిమానులు వివిధ రకాలుగా తమ అభిమానాన్ని చాటుకుంటారు.అలాంటి ఆసక్తికర ఘటన అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలో చోటు చేసుకుంది.
శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణిని ఓ మహిళా అభిమాని ఆనందంతో ఎత్తుకోవడంతో ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.ఇటీవల నిర్వహించిన గడపగడపకు టీడీపీ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే బండారు శ్రావణి( MLA Bandaru Sravani ) నిదనవాడ గ్రామంలో ఉన్నారు.
ఈ సందర్భంగా సీసీ రోడ్డు,కొత్త వీధి దీపాలను.అలాగే గ్రామంలో కల్వర్టు,గోకులం షెడ్లు,పశువుల నీటి తొట్టెల ఏర్పాటుకు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
పర్యటన సందర్భంగా ఎమ్మెల్యేను కలిసిన ఓ మహిళా అభిమాని ఆనందాన్ని అదుపు చేసుకోలేక ఆమెను ఎత్తుకుని అభిమానాన్ని చాటుకుంది.అక్కడున్న వారు ఈ దృశ్యాలను వీడియోగా చిత్రీకరించగా,ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది.

