- జులై 24 వరకు ఇంటింటి సర్వే
- 31న ముసాయిదా ఓటర్ల జాబితా
- ఆగస్టు 30 వరకు అభ్యంతరాల స్వీకరణ
- అక్టోబర్ 3న తుది ఓటర్ల జాబితా
విశాలాంధ్ర – సచివాలయం: ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి ఎన్నికల సంఘం అండర్ సెక్రటరీ సందీప్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ చేసిన విజ్ఞప్తిని సానుకూలంగా తీసుకున్న కేంద్ర ఎన్నికల సంఘం… మంగళవారం సవరించిన సరికొత్త షెడ్యూల్ను అధికారికంగా విడుదల చేసింది.
దీని ప్రకారం బూత్ స్థాయి అధికారులు (బీఎల్వోలు) ఇంటింటి సర్వేలో జులై 24 వరకు కొనసాగుతుంది. పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ, పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ కూడా జులై 24లోపు పూర్తి చేయాలని నిర్ణయించారు. ఒకవైపు సర్వే సాగుతుండగానే, మరోవైపు ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ పనులు రాష్ట్రవ్యాప్తంగా రికార్డు వేగంతో ముగింపు దశకు చేరుకున్నాయి. రాష్ట్రంలో మొత్తం 4,16,27,694 మంది ఓటర్లలో ఏకంగా 4,15,95,163 మంది డేటా ఎంట్రీ పూర్తి కావడం ద్వారా 99.92 శాతం అద్భుత వృద్ధి నమోదైంది. ముఖ్యంగా కేవలం 24 గంటల వ్యవధిలోనే అత్యధికంగా 12,29,224 ఫారాలను ఐటీ విభాగం కంప్యూటరీకరించి సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ కార్యక్రమంలో ఇప్పటికే ఏలూరు, అల్లరి సీతారామరాజు, కాకినాడ, పోలవరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, పశ్చిమ, మార్కాపురం, అనకాపల్లి, విజయనగరం, నంద్యాల, ప్రకాశం సహా మొత్తం 15 జిల్లాల్లో వంద శాతం డిజిటల లక్ష్యాన్ని విజయవంతంగా అధిగమించిన ఈ ఘనత సాధించిన జిల్లా కలెక్టర్లను సీఈఓ వివేక్ యాదవ్ అభినందించారు. అయితే ఇదే సమయంలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా 98.68 శాతంతో రాష్ట్రంలోనే చివరి స్థానంలో నిలిచారు, కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన నూతన షెడ్యూల్ ప్రకారం జూన్ 15న ప్రారంభమైన బీఎల్ఓల క్షేత్రస్థాయి పరిశీలన జులై 24న ముగియనుండగా, అనంతరం జులై 31న ముసాయిదా (డ్రాఫ్ట్) ఓటర్ల జాబితాను అధికారికంగా ప్రచురించారు. ఆ వెంటనే జులై 31 నుండి ఆగస్టు 30 వరకు ఓటర్ల నుండి క్లెయిమ్లు, అభ్యంతరాలు, దరఖాస్తులను స్వీకరించండి… వాట రిజిస్ట్రేషన్ సెప్టెంబర్ 28 లోగా పూర్తిగా పరిష్కరిస్తారు. చివరగా అక్టోబర్ 3న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తుది ఓటర్ల జాబితాను విడుదల చేయాలని ఈసీ స్పష్టం చేసింది. ఈ మార్పులను రాష్ట్రంలోని అన్ని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు తక్షణమే లిఖితపూర్వకంగా తెలియజేయాలని అధికారులు ఈసీఐఐ… సాధారణ ఓటర్లకు నూతన అవకాశాలపై అవగాహన కల్పించేలా మీడియా, సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృత స్థాయి ప్రచారం నిర్వహించాలని మార్గదర్శకాలను జారీ చేసింది.
పోస్ట్ ఎస్ఐఆర్ అనుమతిపొడిగింపు మొదట కనిపించింది విశాలాంధ్ర.

