విశాలాంధ్ర _అనకాపల్లి: అనకాపల్లి జిల్లా పరవాడ మండలం తానో గ్రామానికి చెందిన బాలుడు రాయుడు శశికాంత్ ఆత్మహత్య కేసులో ఇప్పటికి నలుగురు ముద్దాయిలను అరెస్టు చేసేందుకు ఎస్పీ తుహిన్ సిన్హా చొరవే కారణమని జిల్లా యాత సంక్షేమ సంఘం అధ్యక్షుడు పెంకె మారేష్ అన్నారు. శనివారం వుడ్ పేటలో జరిగిన సంఘ సమావేశంలో మారేష్ మాట్లాడుతూ. అత్యంత వెనుకబడిన యాత కులన్నకు చెందిన బాలుడు పై కొంతమంది రాజకీయ పలుకుబడి కలిగిన వారు చేసి వేధించడం వలన ఆ బాలుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని మారిష్ చెప్పారు. ఈ విషయంలో మొదటి కేసును నీరుగార్చడానికి ప్రయత్నించిన పరవాడ సిఐ వైఖరి పట్ల జిల్లా యాత సంక్షేమ సంఘం అభ్యంతరం లేదని, పరవాడ సిఐ వైఖరి పట్ల యాత సామాజిక వర్గం పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేయడంతో జిల్లా సూపర్డెంట్ పోలీస్ స్పందించిన కేసును పరవాడ సిఐ నుండి సబ్వరం సిఐకి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం వలన పూర్వాభివృద్ధి సాధించినట్లు మారేష్ చెప్పారు. సబ్బవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ పూర్తి స్థాయి కేసును పరిశీలించి అదనపు సాక్ష్యాలను సేకరించి మరో ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు వివరించారు. పేద వర్గాలకు అండగా నిలిచిన ఎస్పీ కి సమావేశం కృతజ్ఞతలు తెలియజేసింది. విద్యార్థి రాయుడు శశికాంత్ ఆత్మహత్య కేసులో మిగిలిన ముద్దాయిలను కూడా అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు నిలపాలని మారేష్ పోలీస్ అధికారులకు విజ్ఞప్తి చేశారు.
కేసు విచారణలో జాప్యం జరుగుతుందనే ఉద్దేశంతో జూన్ 1వ తేదీ నుండి మరల రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని అనకాపల్లిలో ఏర్పాటు చేయాలని నిర్ణయించామని, అయితే పోలీసు అధికారులు మరింత లోతుగా విచారణ జరుపుతున్నందున జూన్ 1వ తేదీ నుండి తలపెట్టిన రిలే నిరాహార దీక్షను తాత్కాలికంగా వాయిదా వేయాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ సమావేశంలో జిల్లా యాత సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి గుత్తుర్తి అప్పారావు, జిల్లా కార్యవర్గ సభ్యులు జుట్టుక రాము, ఎర్ర రాము మాట్లాడారు.

